Director Krishna Vamshi: ఇండస్ట్రీలో అనాథను అయిపోయాను.. కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్ కృష్ణవంశీ..
అలాగే ఇప్పటితరం ప్రేక్షకులు కృష్ణవంశీ చిత్రాలకు కనెక్ట్ కాలేకపోతున్నారనేది మరో వాస్తవం. అందమైన ప్రేమకథలు, చక్కటి కుటుంబకథా చిత్రాలు, ధైవభక్తి కథలు ఇలా ఎన్నో సినిమాలను తెరకెక్కించిన కృష్ణవంశీ ఇప్పుడు సక్సెస్ కాలేకపోతున్నారు. కొన్నిరోజుల క్రితమే రంగమార్తండ సినిమాతో మరోసారి మనసుకు హత్తుకునే కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

డైరెక్టర్ కృష్ణవంశీ.. తెలుగు సినీ ప్రపంచంలో ఎన్నో అందమైన సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు. ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ అందుకున్న అనేక చిత్రాలు కృష్ణవంశీ రూపొందించినవే. గులాబీ, సింధూరం, అంతఃపురం, మురారి, ఖడ్ం, రాఖీ, చందమామ, మహాత్మ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. సినీ పరిశ్రమలో కృష్ణవంశీ చిత్రాలు చాలా ప్రత్యేకం. అలాగే సినిమాల్లోని పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే విధంగా అద్భుతంగా డిజైన్ చేయడం కృష్ణవంశీకి మరెవరు సాటిలేరు. కానీ కొంతకాలంగా కృష్ణవంశీ తెరకెక్కించిన సినిమాలు థియేటర్లలో కమర్షియల్ హిట్స్ అందుకోలేకపోతున్నాయి. అలాగే ఇప్పటితరం ప్రేక్షకులు కృష్ణవంశీ చిత్రాలకు కనెక్ట్ కాలేకపోతున్నారనేది మరో వాస్తవం. అందమైన ప్రేమకథలు, చక్కటి కుటుంబకథా చిత్రాలు, ధైవభక్తి కథలు ఇలా ఎన్నో సినిమాలను తెరకెక్కించిన కృష్ణవంశీ ఇప్పుడు సక్సెస్ కాలేకపోతున్నారు. కొన్నిరోజుల క్రితమే రంగమార్తండ సినిమాతో మరోసారి మనసుకు హత్తుకునే కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
ఇదిలా ఉంటే.. చాలా రోజులుగా కృష్ణవంశీ సైలెంట్ అయ్యారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇండస్ట్రీలో అనాథను అయిపోయానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. దిగ్గజ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళులుగా నా ఉచ్ఛ్వాసం కవనం పేరుతో ఓ ఈవెంట్ నిర్వహించారు. మే 20న సిరివెన్నెల జయంతి సందర్భంగా ఈరోజు ఈ వేడుకను నిర్వహించగా.. సినీ ప్రముఖులు, సింగర్స్ పాల్గొన్నారు. ఈ వేడుకకు డైరెక్టర్ కృష్ణవంశీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో కృష్ణవంశీ మాట్లాడుతూ సిరివెన్నెలను గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు.
కృష్ణవంశీ మాట్లాడుతూ.. “సిరివెన్నెల శాస్త్రి గారితో 1989 నుంచి పరిచయం ఉంది. ఆయన దొరకడం మహా అదృష్టం. ఏ అర్హత లేకపోయినా నన్ను కొడుకుగా స్వీకరించి.. వాళ్ల ఇంట్లోనే ఉండేవాళ్లం. ఆయన ఉంటే ధైర్యంగా ఉంటుంది. ఆరేడు నెలల నుంచి సినిమా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను అని.. పాటలు ఏం చేయాలో అర్థం లేదు. ఆయన ఉప్పుడు ఇలాంటి పాటలు ఉంటాయి. ఇలాంటి కథ అని అనుకుని ఆయన దగ్గరకు వెళ్లేవాడిని. అలాంటిది ఇవాళ అది లేదు. ఒక రకంగా ఇండస్ట్రీలో అనాథను అయిపోయాను” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




