Health Insurance: ఆరోగ్య బీమాలో నెట్‌వర్క్‌ ఆసుపత్రుల ప్రాధాన్యత ఏమిటి?

ఈ మధ్యకాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆరోగ్య బీమా ప్రాధాన్యతను బాగా గుర్తించాయి. వైద్య ఖర్చులను కవర్‌ చేయడానికి ఆరోగ్య బీమా చాలా అవసరం. అనారోగ్యాలు సర్వసాధారణమైన నేటి ప్రపంచంలో ప్రజలు తమ వైద్య అవసరాలను తీర్చగల మంచి ఆరోగ్య బీమా పాలసీలో తప్పనిసరిగా పెట్టుబడి పెట్టాలి. ఆరోగ్య బీమా.. వైద్యం అత్యవసరమైనప్పుడు సొంత డబ్బు

Health Insurance: ఆరోగ్య బీమాలో నెట్‌వర్క్‌ ఆసుపత్రుల ప్రాధాన్యత ఏమిటి?
Health Insurance
Follow us

|

Updated on: May 18, 2024 | 8:25 PM

ఈ మధ్యకాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆరోగ్య బీమా ప్రాధాన్యతను బాగా గుర్తించాయి. వైద్య ఖర్చులను కవర్‌ చేయడానికి ఆరోగ్య బీమా చాలా అవసరం. అనారోగ్యాలు సర్వసాధారణమైన నేటి ప్రపంచంలో ప్రజలు తమ వైద్య అవసరాలను తీర్చగల మంచి ఆరోగ్య బీమా పాలసీలో తప్పనిసరిగా పెట్టుబడి పెట్టాలి. ఆరోగ్య బీమా.. వైద్యం అత్యవసరమైనప్పుడు సొంత డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను పొందేందుకు వీలు కల్పిస్తుంది. ఆరోగ్య బీమాలో నెట్‌వర్క్‌ ఆసుపత్రుల గురించి వినే ఉంటారు. ఆరోగ్య బీమాలో నెట్‌వర్క్‌ ఆసుపత్రుల ప్రాముఖ్యత ఇప్పుడు తెలుసుకుందాం.

నెట్‌వర్క్‌ ఆసుపత్రులు..

ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేసేటప్పుడు పాలసీదారుడు నెట్‌వర్క్‌ ఆసుపత్రుల జాబితాను పొందుతారు. నగదు రహిత చికిత్స పొందగల ఆసుపత్రులను నెట్‌వర్క్‌ ఆసుపత్రులు అని పిలుస్తారు. నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ అంటే బీమా కంపెనీలతో టై-అప్‌ ఉన్న ఆసుపత్రులు. ఈ ఆసుపత్రులలో బీమా క్లెయిమ్స్‌ ప్రక్రియ చాలా సులభం. బీమా సంస్థలు దేశంలోని చాలా అత్యుత్తమ ఆసుపత్రులతో టై-అప్‌ కలిగి ఉంటాయి. పేరున్న కొన్ని బీమా సంస్థలైతే 3 వేల నుంచి 10 వేల వరకు నెట్‌వర్క్‌ ఆసుపత్రులను కలిగి ఉంటాయి. ఆసుపత్రిలో చేరే సమయంలో ఆసుపత్రికి ఏమీ చెల్లించకుండానే ఎంచుకున్న ఆసుపత్రిలో నగదు రహిత చికిత్సను పొందొచ్చు. బీమా సంస్థ పాలసీ నిబంధనలు, షరతులకు లోబడి పేషెంట్‌కు సంబంధించిన బిల్లును బీమా కంపెనీ నేరుగా ఆసుపత్రికి చెల్లిస్తుంది.

నెట్‌వర్క్‌ హాస్పిటల్‌ ప్రయోజనాలు

వైద్య అత్యవసర పరిస్థితులు, చికిత్సలు పాలసీదారుడిని చాలా ఒత్తిడికి గురిచేస్తాయి. ఈ సమయంలోనే బిల్లులు సెటిల్‌ చేయడం అదనపు ఒత్తిడిగా ఉంటుంది. కానీ, మెడికల్‌ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు నెట్‌వర్క్‌ ఆసుపత్రిలో చేరితే పాలసీదారుడు ఆసుపత్రి బిల్లులు చెల్లించడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. బీమా సంస్థ నేరుగా పేషెంట్‌ బిల్లులు సెటిల్‌ చేస్తుంది కాబట్టి, పాలసీదారుడు డబ్బు కోసం కంగారు పడాల్సిన అవసరం లేదు. అందుచేత, ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేసేటప్పుడే పాలసీదారుడు ముందుగా నెట్‌వర్క్‌ ఆసుపత్రుల జాబితాను తనిఖీ చేయాలి. నాణ్యతలో రాజీ పడకుండా కావలసిన వైద్య చికిత్సను పొందొచ్చు. అంతేకాకుండా, ఒక నిర్దిష్ట చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉన్నట్లయితే ఉత్తమమైన వైద్య చికిత్సను అందించగల ఉత్తమ నెట్‌వర్క్‌ ఆసుపత్రిని ఎంచుకోవచ్చు.

నెట్‌వర్క్‌ ఆసుపత్రి ఎంపిక

పాలసీ పత్రం లేదా బీమా కంపెనీ వెబ్‌సైట్‌ని ఉపయోగించి నెట్‌వర్క్‌ ఆసుపత్రుల జాబితాను సులభంగానే కనుక్కోవచ్చు. నగదు రహిత బీమా విషయంలో పేషెంట్‌కు నచ్చిన/దగ్గరలో ఉన్న నెట్‌వర్క్‌ ఆసుపత్రిలో చికిత్స పొందడం ఉత్తమం. ప్రతి నగరంలో బహుళ నెట్‌వర్క్‌ ఆసుపత్రులు ఉన్నాయి. ప్రదేశం, మెరుగైన చికిత్స, ధర మొదలైన అంశాల ఆధారంగా సర్వే చేసి, ఆపై మీ అవసరాలకు అనుగుణంగా అత్యంత అనుకూలమైన ఆసుపత్రిని ఎంచుకోవచ్చు.

చికిత్స

రోగి నెట్‌వర్క్‌ ఆసుపత్రిలో చేరిన తర్వాత, నగదు రహిత బీమాను పొందేందుకు థర్డ్‌ పార్టీ అడ్మినిస్ట్రేటర్‌ (TPA) కు ఒక ఫారం సమర్పించాలి. ఆసుపత్రి నగదు రహిత క్లెయింను ధ్రువీకరించిన తర్వాత, వైద్య చికిత్స పొందేందుకు అర్హులు. ఆసుపత్రి ఖర్చులన్నీ నిబంధనల మేరకు బీమా సంస్థే భరిస్తుంది. డిశ్చార్జ్‌ సమయంలో రోగి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎలాంటి డాక్యుమెంట్స్, బిల్లులూ సమర్పించాల్సిన అవసరం కూడా ఉండదు. అయితే, పాలసీ పత్రంలో కవర్‌ చేయని ఏదైనా ఖర్చు ఉంటే దాన్ని బీమా సంస్థ కవర్‌ చేయదు.

నాన్‌-నెట్‌వర్క్‌ ఆసుపత్రి చికిత్స, క్లెయిమ్‌

జాబితాలో చేర్చని ఆసుపత్రులను ‘నాన్‌-నెట్‌వర్క్‌ ఆసుపత్రులు’ అంటారు. రోగి నెట్‌వర్క్‌ ఆసుపత్రిలో కావలసిన చికిత్స అందుబాటులో లేనప్పుడు లేదా అత్యవసర పరిస్థితుల్లో నాన్‌-నెట్‌వర్క్‌ ఆసుపత్రిని ఎంచుకోవచ్చు. నాన్‌-నెట్‌వర్క్‌ ఆసుపత్రిలో చేరితే, పాలసీదారుడు చికిత్సకు సంబంధించిన ఆసుపత్రి బిల్లులను ముందుగా సొంతంగా చెల్లించవలసి ఉంటుంది. తదనంతరం రసీదులు, డిశ్చార్జ్ సమ్మరి, ఇతర పత్రాలతో సహా బీమా కంపెనీకి సమర్పించాలి. తర్వాత బీమా కంపెనీ హామి మొత్తం ఆధారంగా రీయింబర్స్‌ చేస్తుంది. అయితే, ఇది చాలా శ్రమతో కూడుకున్న ప్రక్రియ. దీనికి రాతపనితో పాటు సరైన పత్రాల అవసరం కూడా ఉంటుంది. కొన్నిసార్లు క్లెయిమ్‌ మొత్తంలో కొంత భాగాన్ని తిరస్కరించే అవకాశం కూడా ఉంటుంది. ఎవరైనా నాన్‌-నెట్‌వర్క్‌ హాస్పిటల్‌ను సంప్రదిస్తే.. ఈ సుదీర్ఘ క్లెయిమ్‌ ప్రక్రియ ద్వారా వెళ్లవలసి ఉంటుంది. అందుకనే బీమా కంపెనీలు నగదు రహిత క్లెయిమ్‌ ప్రక్రియను అమలు చేయడానికి నెట్‌వర్క్‌ ఆసుపత్రిలో చికిత్సకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త