కాల్ సెంటర్‌లో పని.. ఆపై సూపర్ స్టార్‌తో ఫస్ట్ మూవీ.. ఎవరో తెల్సా.?

Ravi Kiran

18 May 2024

కొంతమంది హీరోయిన్లకు అదృష్టం బాగా కలిసొస్తుంది. మొదటి సినిమాతోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంటారు. అలా దక్కించుకున్న వారిలో జరీన్ ఖాన్ ఒకరు. 

కానీ ఈమెకు ఆ మొదటి సినిమానే.. దురదృష్టంగా మారింది. సల్మాన్ ఖాన్‌కు జోడీగా మొదటి సినిమా ఆఫర్ అందుకున్న ఎందరో హీరోయిన్లు ఫేడ్ అవుట్ అయిన విషయం తెలిసిందే. వారిలో ఒకరు ఈ జరీన్ ఖాన్. 

పీరియాడికల్ వార్ డ్రామా ‘వీర్’ మూవీతో జరీన్ ఖాన్ హీరోయిన్‌గా పరిచయమైంది. ఇందులో సల్మాన్ ఖాన్‌ హీరో. కత్రినా కైఫ్‌ లాంటి రూపం ఆమె సొంతం అయినప్పటికీ.. అదే ఆమెకు శాపంగా మారింది. 

1987 మే 14న ముంబైలో జన్మించిన జరీన్.. చదువు అనంతరమ కొంతకాలం కాల్ సెంటర్‌లో పని చేసింది. ఆ తర్వాత అనూహ్యంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అనుకోకుండా సుభాష్ ఘై ఫిల్మ్ స్కూల్ ‘విస్లింగ్ వుడ్స్‌’లో జరీన్ ఖాన్‌ను చూశాడు సల్మాన్

ఆ వెంటనే ఆ సమయంలో తన తదుపరి చిత్రం.. అదే అనిల్ శర్మ దర్శకత్వం వహించిన 'వీర్'లో జరీన్ ఖాన్ హీరోయిన్‌గా ఎంపికైంది.   

 హౌస్‌ఫుల్ 2, నాన్ రాజావగా పొగిరెన్, హేట్ స్టోరీ 3, అక్సర్ 2, జాట్ జేమ్స్ బాండ్ వంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.

 ప్యార్ మంగా హై, దో వారి జట్, చాన్ చాన్, ఈద్ హో జాయేగీ వంటి ప్రైవేటు ఆల్బమ్స్ చేసింది. తెలుగులోనూ గోపీచంద్‌ నటించిన ‘చాణక్య’ చిత్రంలో కనిపించింది.

సినీ బ్యాక్‌గ్రాండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాను. కెరీర్ ప్రారంభంలో కత్రినాతో పోల్చడం హ్యాపీగా అనిపించింది. కానీ ఆ పోలిక నా కెరీర్‌పై భారీగా పడింది. కొన్ని ఎదురుదెబ్బలు తగిలాయి. నా టాలెంట్ నిరూపించుకోవడానికి ఎవ్వరూ కూడా సరిగ్గా అవకాశాలు ఇవ్వలేదు