Munger Sita Kund: సీతా కుండ్.. ఎప్పుడు వేడిగా ఉండే నీరు.. నేటికీ సైన్స్ చేధించని మిస్టరీ

ఆలయ ప్రాంగణంలోని సీతాకుండ్‌తో పాటు, రాముడు, లక్ష్మణుడు, భరత్, శత్రుఘ్న పేర్లతో సమీపంలో నాలుగు కొలనులు కూడా ఉన్నాయి. అయితే సీతా కుండ్‌లోని నీరు ఎప్పుడూ వేడిగా ఉంటుంది. కాగా మిగిలిన నాలుగు చెరువుల నీరు చల్లగా ఉంది. ఇది ఇప్పటికీ ప్రజలకు పరిష్కారం కాని పజిల్‌లా ఉంది. సీతా కుండ్‌లోని వేడి నీటి రహస్యాన్ని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పరిశోధనల కోసం ఇక్కడికి వస్తుంటారు. అయితే ఇప్పటి వరకు ఈ మిస్టరీని ఎవరూ ఛేదించలేకపోయారు.

Munger Sita Kund: సీతా కుండ్.. ఎప్పుడు వేడిగా ఉండే నీరు.. నేటికీ సైన్స్ చేధించని మిస్టరీ
Sita Kund Munger
Follow us
Surya Kala

|

Updated on: May 18, 2024 | 8:59 PM

బీహార్‌లోని ముంగేర్‌లో రామాయణానికి సంబంధించిన అనేక ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో ఒకటి సీతా కుండ్. సీత దేవి ఇక్కడే అగ్నిపరీక్ష చేసిందని ప్రతీతి. అందుకే సీతా కుండ్ హిందువుల పుణ్యక్షేత్రంగా బాసిల్లుతోంది. సీతా దేవి ఎక్కడ అగ్ని ప్రవేశం చేసిందే అక్కడ ఈ కొలను ఏర్పడిందని నమ్మకం. ఈ కొలనులోని నీరు ఎప్పుడూ వేడిగా ఉంటుందని.. అంటే వసంత కాలంలో కూడా నీరు సహజంగా వేడిగా ఉంటుందని.. అందుకనే ఈ కొలనులోని నీరు పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ప్రదేశాన్ని రామతీర్థం అని కూడా అంటారు. ఈ చెరువులో ఉండే నీరు ఎప్పుడూ వేడిగా ఉండటానికి గల కారణం నేటికీ మిస్టరీగా మిగిలిపోయింది.

సీతా కుండ్ నీరు మాత్రమే వేడిగా ఉంటుంది ఆలయ ప్రాంగణంలోని సీతాకుండ్‌తో పాటు, రాముడు, లక్ష్మణుడు, భరత్, శత్రుఘ్న పేర్లతో సమీపంలో నాలుగు కొలనులు కూడా ఉన్నాయి. అయితే సీతా కుండ్‌లోని నీరు ఎప్పుడూ వేడిగా ఉంటుంది. కాగా మిగిలిన నాలుగు చెరువుల నీరు చల్లగా ఉంది. ఇది ఇప్పటికీ ప్రజలకు పరిష్కారం కాని పజిల్‌లా ఉంది.

పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు సీతా కుండ్‌లోని వేడి నీటి రహస్యాన్ని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పరిశోధనల కోసం ఇక్కడికి వస్తుంటారు. అయితే ఇప్పటి వరకు ఈ మిస్టరీని ఎవరూ ఛేదించలేకపోయారు. పరిశీలన అనంతరం ఈ చెరువు పొడవు, వెడల్పు 20 అడుగులు కాగా, చెరువు 12 అడుగుల లోతు ఉందని చెప్పారు. అలాగే పరీక్ష నిర్వహించి ఎనిమిది నెలల పాటు ఇక్కడి నీరు వేడిగా ఉంటుందని తెలిపారు. వేసవిలో నీటి ఉష్ణోగ్రత తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు.

ఇవి కూడా చదవండి

మాఘమాసంలో ప్రత్యేక జాతర ప్రజలు ఏడాది పొడవునా సీతా కుండ్‌ని సందర్శించడానికి వస్తూనే ఉంటారు. అయితే మాఘమాసంలో ప్రత్యేక జాతర నిర్వహిస్తారు. ఈ సమయంలో చాలా మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చి సీతా కుండ్‌లోని వేడి నీటిలో స్నానం చేసి ఆలయంలో పూజలు చేస్తారు. ఈ జాతర నెల రోజుల పాటు కొనసాగుతుంది. అంతేకాదు మకర సంక్రాంతి పండుగ సమయంలో స్నానం చేయడానికి భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు