AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అద్దం అక్కడ ఉందా..? మీ ఇంట్లో ఈ సమస్యలు ఖాయం.. వెంటనే ఇలా చేయకపోతే..

ఇల్లు అందంగా ఉండటం ఎంత ముఖ్యమో.. ఆ ఇంట్లో ఉండే వస్తువులు వాస్తు ప్రకారం ఉండటం కూడా అంతే ముఖ్యం. సాధారణంగా మనం లివింగ్ రూమ్ లేదా బెడ్ రూమ్ వాస్తుపై చూపే శ్రద్ధ, బాత్రూమ్ విషయంలో చూపము. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం.. బాత్రూమ్ అనేది నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండే ప్రదేశం. అక్కడ మనం అమర్చే చిన్న అద్దం కూడా మన జీవితంపై భారీ ప్రభావాన్ని చూపుతుంది.

అద్దం అక్కడ ఉందా..? మీ ఇంట్లో ఈ సమస్యలు ఖాయం..  వెంటనే ఇలా చేయకపోతే..
Bathroom Mirror Vastu Tips
Krishna S
|

Updated on: Jan 11, 2026 | 7:25 AM

Share

మన ఇంట్లో బాత్రూమ్ అనేది కేవలం శుభ్రతకు సంబంధించిన ప్రదేశం మాత్రమే కాదు. అది ఇంటి శక్తిని ప్రభావితం చేసే ముఖ్యమైన భాగం కూడా. వాస్తు శాస్త్రం ప్రకారం.. బాత్రూంలో అమర్చే వస్తువులు, ముఖ్యంగా అద్దం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే ప్రతికూల శక్తి పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీ బాత్రూంలో అద్దం అమర్చేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కీలక విషయాలు ఇక్కడ ఉన్నాయి.

అద్దం దిశ చాలా ముఖ్యం

బాత్రూంలో అద్దం ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. జ్యోతిష్యం ప్రకారం.. అద్దం ఎప్పుడూ బాత్రూమ్ తలుపుకు నేరుగా ఎదురుగా ఉండకూడదు. తలుపు తీయగానే మన ప్రతిబింబం అద్దంలో కనిపించడం వల్ల ప్రతికూల శక్తి పెరిగి, జీవితంలో అడ్డంకులు ఏర్పడతాయని నమ్ముతారు. అద్దాలను ఎప్పుడూ ఉత్తరం లేదా తూర్పు గోడలపై అమర్చడం వల్ల సానుకూల ఫలితాలు ఉంటాయి.

ఆకారంపై శ్రద్ధ వహించండి

అద్దం ఆకారం కూడా మన ఆలోచనా దృక్పథంపై ప్రభావం చూపుతుంది. వాస్తు ప్రకారం.. బాత్రూంలో దీర్ఘచతురస్రాకార లేదా చతురస్రాకార అద్దాలను అమర్చడం అత్యంత శుభప్రదం. ఇవి సానుకూల శక్తిని ప్రోత్సహించడమే కాకుండా ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తాయి.

విరిగిన అద్దాలు అరిష్టం

చాలా మంది అద్దం మూలల్లో పగిలినా లేదా చిన్న పగుళ్లు వచ్చినా పట్టించుకోకుండా వాడుతుంటారు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పగిలిన లేదా విరిగిన అద్దాలు ఇంట్లో తీవ్రమైన ఒత్తిడిని, మానసిక అశాంతిని కలిగిస్తాయి. అలాగే అద్దం మసకబారి మురికిగా ఉండకూడదు. అద్దం ఎప్పుడూ స్పష్టంగా, శుభ్రంగా ఉంటేనే ఇంట్లోకి సంపద, ఆరోగ్యం చేకూరుతాయి.

అద్దం ఎత్తు ఎంత ఉండాలి?

అద్దం మరీ తక్కువ ఎత్తులో ఉండకూడదు. అద్దంలో మన ప్రతిబింబం చూసుకున్నప్పుడు తల పైభాగం స్పష్టంగా కనిపించేలా ఎత్తును సర్దుబాటు చేసుకోవాలి. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది.

నిపుణుల సలహా మేలు

మీరు కొత్తగా ఇల్లు నిర్మిస్తున్నా లేదా బాత్రూమ్ రీమోడలింగ్ చేస్తున్నా, అద్దం విషయంలో సందేహాలు ఉంటే వాస్తు నిపుణుడిని సంప్రదించడం మంచిది. సరిగ్గా ఉంచిన అద్దం ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని బయటకు పంపి, పాజిటివ్ ఎనర్జీని నిలుపుకోవడానికి దోహదపడుతుంది.

అద్దం అనేది ప్రతిబింబాన్ని చూపే సాధనం మాత్రమే కాదు, అది శక్తిని ప్రతిబింబించే వనరు కూడా. అందుకే బాత్రూమ్ అద్దం విషయంలో ఈ చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మీ జీవితంలో సానుకూల మార్పులను ఆహ్వానించవచ్చు.

అద్దం అక్కడ ఉందా..? మీ ఇంట్లో ఈ సమస్యలు ఖాయం.. వెంటనే ఇలా..
అద్దం అక్కడ ఉందా..? మీ ఇంట్లో ఈ సమస్యలు ఖాయం.. వెంటనే ఇలా..
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం..!
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం..!
ఉడికించిన గుడ్లను ఎంతటైంలోపు తొనొచ్చు? వాటిని ఎలా స్టోర్ చేయాలి
ఉడికించిన గుడ్లను ఎంతటైంలోపు తొనొచ్చు? వాటిని ఎలా స్టోర్ చేయాలి
చికెన్ లెగ్ పీస్ ఎందుకు అంత స్పెషల్.. దాన్ని టేస్ట్ వెనకున్న..
చికెన్ లెగ్ పీస్ ఎందుకు అంత స్పెషల్.. దాన్ని టేస్ట్ వెనకున్న..
చైనాకు చెక్‌? అమెరికా నుంచి భారత్‌కు ప్రత్యేక ఆహ్వానం!
చైనాకు చెక్‌? అమెరికా నుంచి భారత్‌కు ప్రత్యేక ఆహ్వానం!
AP SET 2025 నోటిఫికేషన్‌ విడుదల.. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం
AP SET 2025 నోటిఫికేషన్‌ విడుదల.. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం
జిమ్‌కు వెళ్లక్కర్లేదు.. చలికాలంలో ఈ పండ్లు తింటే ఈజీగా బరువు..
జిమ్‌కు వెళ్లక్కర్లేదు.. చలికాలంలో ఈ పండ్లు తింటే ఈజీగా బరువు..
EV బ్యాటరీ ప్యాక్‌లపై ఆధార్‌ నంబర్‌ ఎందుకంత ముఖ్యం!
EV బ్యాటరీ ప్యాక్‌లపై ఆధార్‌ నంబర్‌ ఎందుకంత ముఖ్యం!
విగ్రహం కింద గుప్త నిధుల ఉన్నాయంటూ తవ్వకాలు.. తీరా తీసి చూస్తే..
విగ్రహం కింద గుప్త నిధుల ఉన్నాయంటూ తవ్వకాలు.. తీరా తీసి చూస్తే..
నెలకు రూ.55,932 జీతంతో.. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో కొలువులు
నెలకు రూ.55,932 జీతంతో.. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో కొలువులు