Jalsa Movie: అమ్మా బాబోయ్.. పవన్ జల్సా మూవీ హీరోయిన్ ఇలా మారిందేంటీ..? గుర్తుపట్టడం కష్టమే..

మెయిన్ హీరోయిన్ గా ఇలియానా నటించగా.. సెకండ్ హీరోయిన్ గా పార్వతి మెల్టన్ కనిపించింది. పేరుకు సెకండ్ హీరోయిన్ అయినా.. ఈ బ్యూటీ స్క్రీన్ ప్రజెన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇందులో జో పాత్రలో గ్లామర్ లుక్ లో అదరగొట్టేసింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. జల్సా సినిమా కంటే ముందు అనేక చిత్రాల్లో కనిపించిన పార్వతికి.. ఈ సినిమాతోనే ఫాలోయింగ్ పెరిగింది.

Jalsa Movie: అమ్మా బాబోయ్.. పవన్ జల్సా మూవీ హీరోయిన్ ఇలా మారిందేంటీ..? గుర్తుపట్టడం కష్టమే..
Parvathi Melton
Follow us

|

Updated on: May 05, 2024 | 11:43 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో జల్సా ఒకటి. డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రానికి సూపర్ స్టార్ మహేష్ బ్యాగ్రౌండ్ వాయిస్ అందించిన సంగతి తెలిసిందే. ఇందులో పవన్ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించారు. మెయిన్ హీరోయిన్ గా ఇలియానా నటించగా.. సెకండ్ హీరోయిన్ గా పార్వతి మెల్టన్ కనిపించింది. పేరుకు సెకండ్ హీరోయిన్ అయినా.. ఈ బ్యూటీ స్క్రీన్ ప్రజెన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇందులో జో పాత్రలో గ్లామర్ లుక్ లో అదరగొట్టేసింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. జల్సా సినిమా కంటే ముందు అనేక చిత్రాల్లో కనిపించిన పార్వతికి.. ఈ సినిమాతోనే ఫాలోయింగ్ పెరిగింది.

వెన్నెల సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పార్వతి.. ఆ తర్వాత మంచు విష్ణుతో కలిసి గేమ్, అల్లరే అల్లరి, మధుమాసం చిత్రాల్లో నటించింది. అయితే హీరోయిన్ గా ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. దీంతో అనుకున్నంతగా అవకాశాలు కూడా రాలేదు. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన దూకుడు సినిమాలో స్పషల్ సాంగ్ చేసింది. పూవై పూవై అంటాడు ఆటో అప్పారావు పాటతో అప్పట్లో యూట్యూబ్ ను షేక్ చేసింది. ఇవే కాకుండా తెలుగులో పలు చిత్రాల్లో నటించిన పార్వతి హఠాత్తుగా ఇండస్ట్రీ నుంచి మాయమైంది. చాలా కాలంగా ఈ ముద్దుగుమ్మ ఎలాంటి మూవీ ఫంక్షన్స్, సినిమాల్లోనూ కనిపించడం లేదు. కానీ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుంది.

2013లో శంసులాలానిని వివాహం చేసుకున్న ఈ బ్యూటీ అమెరికాలో సెటిల్ అయ్యింది. కానీ ఇప్పుడు ఈ తార సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఎంతో ముద్దుగా ఉండే పార్వతి.. ఇప్పుడు సన్నజాజీ తీగల మారిపోయి అసలు గుర్తుపట్టడానికి వీలు లేకుండా మారిపోయింది. అసలు పార్వతీ మెల్టనేనా ఇలా మారింది అనే సందేహాలు వచ్చే రేంజ్ లో మారింది. ప్రస్తుతం పార్వతి లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Parvati Melton (@parvatim)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
ఎలా వస్తాయి ఇలాంటి ఆలోచనలు.. టమాటోతో ఐస్‌క్రీమ్ రోల్..
ఎలా వస్తాయి ఇలాంటి ఆలోచనలు.. టమాటోతో ఐస్‌క్రీమ్ రోల్..
భారత్‌లో త్వరలో ఎయిర్ టాక్సీ సేవలు.. ఛార్జీలు ఎలా ఉంటాయో తెలుసా?
భారత్‌లో త్వరలో ఎయిర్ టాక్సీ సేవలు.. ఛార్జీలు ఎలా ఉంటాయో తెలుసా?
కారు బీమాతో ఆర్థిక ధీమా.. క్లెయిమ్ చేసే సమయంలో ఆ తప్పలు వద్దంతే.!
కారు బీమాతో ఆర్థిక ధీమా.. క్లెయిమ్ చేసే సమయంలో ఆ తప్పలు వద్దంతే.!
మతం మంటల్లో దేశరాజకీయం ఉడుకుతోందా?
మతం మంటల్లో దేశరాజకీయం ఉడుకుతోందా?
చెన్నైతో హై ఓల్టేజ్ మ్యాచ్.. టాస్ ఓడిన ఆర్సీబీ.. తుది జట్లు ఇవే
చెన్నైతో హై ఓల్టేజ్ మ్యాచ్.. టాస్ ఓడిన ఆర్సీబీ.. తుది జట్లు ఇవే
ఇసుక తవ్వుతుండగా ఏం బయటపడిందో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు
ఇసుక తవ్వుతుండగా ఏం బయటపడిందో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు
సీనియర్ సిటిజన్లు ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదా..?
సీనియర్ సిటిజన్లు ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదా..?
వేసవిలో ఎన్ని గుడ్లు తినవచ్చో తెలుసా నిపుణులు ఏమి చెబుతున్నారంటే
వేసవిలో ఎన్ని గుడ్లు తినవచ్చో తెలుసా నిపుణులు ఏమి చెబుతున్నారంటే
నువ్వు చాలా మంచోడివి కమిన్స్ మామా!.SRH కెప్టెన్ ఏం చేశాడో తెలుసా?
నువ్వు చాలా మంచోడివి కమిన్స్ మామా!.SRH కెప్టెన్ ఏం చేశాడో తెలుసా?
వెచ్చటి వేసవిలో ఏసీలపై కూల్ కూల్ ఆఫర్స్..!
వెచ్చటి వేసవిలో ఏసీలపై కూల్ కూల్ ఆఫర్స్..!