AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ వాహనంలో మహారాష్ట్ర పోలీసుల తనిఖీలు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిమిత్తం అక్కడకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేదు అనుభవం ఎదురయ్యింది. చంద్రపూర్ నియోజకవర్గం గుగూస్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వెళ్తున్న సందర్భంలో మహారాష్ట్ర పోలీసులు రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనాన్ని నిలిపి తనిఖీ చేశారు.

Prabhakar M
| Edited By: |

Updated on: Nov 16, 2024 | 1:41 PM

Share

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిమిత్తం అక్కడకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేదు అనుభవం ఎదురయ్యింది. చంద్రపూర్ నియోజకవర్గం గుగూస్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వెళ్తున్న సందర్భంలో మహారాష్ట్ర పోలీసులు రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనాన్ని నిలిపి తనిఖీ చేశారు. మహారాష్ట్రలో ప్రస్తుతం ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ప్రతి పార్టీ కార్యకలాపాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసులు.. సీఎం రేవంత్ రెడ్డి వాహనాన్ని తనిఖీ చేయడం హాట్ టాపిక్ గా మారింది

మహారాష్ట్రలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్ధతుగా ఎన్నికల సభలో పాల్గొనేందుకు శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో నాగ్ పూర్ కు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడి నుంచి చంద్ర పూర్ లోని గుగూస్ లో ఏర్పాటు చేసిన సభకు  రోడ్డు మార్గంగా వెళ్తున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డిని ఆపి పోలీసులు తనిఖీలు చేశారు. పోలీసులు తనిఖీ జరుగుతున్నంత సేపు సీఎం రేవంత్ రెడ్డి వాహనం లోనే కూర్చున్నారు. పోలీసులకు పూర్తిగా సహకరించారు సీఎం. ఎన్నికల సమయంలో వాహన తనిఖీలు సహజమే అయినా.. సీఎం స్థాయి వ్యక్తులను ఆపి తనిఖీ చేయడం అరుదుగా జరుగుతుంది.

అనంతరం చంద్రాపూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

ఇవాళ, రేపు మహారాష్ట్రలో సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.  ఎన్నికల ప్రచారానికి మరో మూడు రోజులే మిగిలి ఉంది. ఎన్నికల ప్రచార గడువు ఈ నెల 18 సాయంత్రంతో ముగియనుండగా.. 20న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ప్రచార ఘట్టం తుది అంకానికి చేరడంతో  అగ్రనేతలంతా మహారాష్ట్ర ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఎన్నికల సంఘం అధికారులు సైతం ఎక్కడికక్కడ తనిఖీ చేస్తున్నారు.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్