Telangana: కునుకు లేకుండా చేస్తున్న పెద్దపులి.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కలకలం

అడవుల్లో ఉండాల్సిన పులులు జన సంచారంలోకి వస్తున్నాయి. తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం కలకల రేపుతోంది. రెండు రోజులుగా పులి సంచరం ఎక్కువైనట్లు ప్రజలు చెబుతున్నారు. దీంతో అక్కడి ప్రజల కంటి మీద కునుకు లేకుండా అయ్యింది..

Telangana: కునుకు లేకుండా చేస్తున్న పెద్దపులి.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కలకలం
Representative Image
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 16, 2024 | 1:07 PM

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావాసులకు పెద్దపులి కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. నిన్న నిర్మల్ జిల్లాలో సంచారం ఆ ప్రాంతవాసులను భయాందోళనకు గురిచేస్తే.. ఇవాళ మంచిర్యాల జిల్లాలో మరోసారి కలకలం రేపుతోంది . మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం శంకర్ పల్లి శివారు కేకే-5 గని సమీపంలో పెద్దపులి సంచరించడం కలకలం రేపింది. కేకే-5 గని సమీపంలో పంప్ దగ్గర మహారాష్ట్ర నుంచి పత్తి ఏరడానికి వచ్చిన వలస కూలీలు గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు.

దారి వెంట వెళ్తున్న పెద్దపులిని చూసి వలస కూలీలు ఒక్కసారిగా కేకలు వేశారు. శంకర్ పల్లి నుంచి చతలాపూర్ అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు వారు చెప్తున్నారు. పెద్దపులి సంచారంతో వలస కూలీలు ఆందోళన చెందుతున్నారు. కాగా కేకే-5 గని శివారులో పెద్దపులి సంచారం కనిపించినట్లు ప్రజలు చెబుతున్నారు. శంకర్‌పల్లి దగ్గర కూలీలకు పెద్దపులి కనిపించింది. చతలాపూర్‌ అటవీ ప్రాంతంలో పులి సంచారం ఉన్నట్లు అధికారులు సైతం గుర్తించారు.

ఇక శుక్రవారం నిర్మల్ జిల్లా పెంబి మండలంలో పులి సంచారం కలకలం రేపింది. పులి సంచారంతో పెంబితండా శివారు ప్రాంతాలు వణికిపోతున్నాయి. పెంబితండా శివారులో అటవీ శాఖ అధికారులు పులి పాదముద్రలు గుర్తించారు. పశువుల మందపై పులి దాడి చేసింది. పెంబితండా శివారు గ్రామాల్లో అటవీశాఖ అధికారులు డప్పు చాటింపు చేయించారు. రెండు రోజులు అడవి, పొలాల్లోకి వెళ్లవద్దని హెచ్చరిక జారీచేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు