స్టైల్ ఐకాన్ అల్లు అర్జున్ దగ్గరున్న అత్యంత ఖరీదైన 5 వస్తువులు ఇవే..
24 December 2024
Basha Shek
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' దాదాపు 1700 కోట్ల రూపాయల కలెక్షన్లతో దూసుకెళుతోంది.
అదే సమయంలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో అల్లు అర్జున్ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు.
కాగా పుష్ప సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న బన్నీ సంపాదనలోనూ జెట్ స్పీడ్ లో దూసుకెళుతున్నాడు.
ఒక్క పుష్ప 2 సినిమాకే అల్లు అర్జున్ రూ. 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది
ఇక అల్లు అర్జున్ కు విలాసవంతమైన 'ఫాల్కన్ వానిటీ వ్యాన్' ఉంది. దీని విలువ దాదాపు 7 కోట్లకు పైమాటే.
బన్నీ దగ్గర 4 కోట్ల విలువైన జెట్ బ్లాక్ రేంజ్ రోవర్, 75 లక్షల విలువైన 'హమ్మర్ హెచ్3' కార్లు కూడా ఉన్నాయట
ఇక హైదరాబాద్‌లోని విలాసవంతమైన బంగ్లా అత్యంత ఖరీదైనది. దీని ధర దాదాపు 100 కోట్ల రూపాయలు.
మొత్తానికి అల్లు అర్జున్ తన నటనతో, కష్టార్జితంతో వందల కోట్ల ఆస్తులు కూడబెట్టాడని తెలుస్తోంది.
ఇక్కడ క్లిక్ చేయండి..