కోడలి చాటు వ్యవహారం తెలిసి మందలించిన అత్త… తెల్లారేసరికల్లా శవమైన అత్త

రాత్రి ఇంట్లో అందరూ రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించిన సమయంలో రహస్యంగా ఇంట్లోకి ప్రవేశించి పదునైన ఆయుధంతో గుడ్డిదేవి మెడపై దాడి చేశాడు.

కోడలి చాటు వ్యవహారం తెలిసి మందలించిన అత్త... తెల్లారేసరికల్లా శవమైన అత్త
Bihar Crime
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 16, 2024 | 1:12 PM

బీహార్‌లోని పాట్నా జిల్లాలో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. కోడలు చాటుమాటు వ్యవహారాన్ని ప్రశ్నించినందుకు అత్తను హత్య చేశారు. పాలిగంజ్‌లోని సింగోడి పోలీస్ స్టేషన్ పరిధిలోని డియోరియా గ్రామంలో ప్రియుడితో కలిసి అత్తను హత్య చేసింది ఓ కోడలు. పోలీసులకు అందిన సమాచారం మేరకు మృతురాలిని దేవరియాకు చెందిన గుడ్డి దేవిగా గుర్తించారు. ఆమెతోపాటు నిందితుడు సుందర్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

గుడ్డిదేవి కోడలు అదే గ్రామానికి చెందిన సుందర్ యాదవ్‌తో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్లు పాలిగంజ్ డీఎస్పీ-1 ప్రీతమ్ కుమార్ తెలిపారు. ఇద్దరూ కలిసి ఎక్కువ సమయం గడిపేవారు. అలాంటి పరిస్థితిలో ఒకరోజు కోడలు సుందర్‌ని ఇంటికి పిలిస్తే ఆ మహిళ అది చూసి గుడ్డిదేవికి వీళ్ల ప్రేమ విషయం తెలిసింది. దీంతో గుడ్డిదేవి తన కోడలుపై ఆగ్రహాం వ్యక్తం చేసింది. తన కుమారుడికి కూడా చెబుతానని బెదిరించింది.

గుడ్డి దేవి బెదిరించడంతో కోడలు యువకుడితో మాట్లాడడం మానేసిందని ప్రీతమ్ కుమార్ తెలిపారు. సుందర్ దీనికి అస్సలు ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే నవంబర్ 14వ తేదీ రాత్రి ఇంట్లో అందరూ రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించిన సమయంలో రహస్యంగా ఇంట్లోకి ప్రవేశించి పదునైన ఆయుధంతో గుడ్డిదేవి మెడపై దాడి చేశాడు. నిందితులు మొదట పదునైన ఆయుధంతో మహిళపై దాడి చేశారని, ఆపై ఆమె నోటిలోకి తుపాకీ పెట్టి కాల్చారని, దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయిందని పోలీసులు తెలిపారు. గుడ్డిదేవి భర్త ఎదుటే నిందితుడు సుదర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

ప్రియురాలితోపాటు నిందితుడు సుందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా హత్యకు ఉపయోగించిన కంట్రీ మేడ్ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. సమాచారం ప్రకారం, సుందర్ రాజస్థాన్‌లో పనిచేశాడు. ఆసమయంలో గుడ్డిదేవి కోడలు కూడా రాజస్థాన్‌లోనే ఉండేది. ఆ తర్వాత ఇద్దరికీ పరిచయం ఏర్పడి ఆ తర్వాత ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పండుగ సందర్భంగా సుందర్, మహిళ కోడలు ఇంటికి వచ్చారు. ఈ పరిస్థితుల్లో సుందర్ తరచూ తన కోడలిని కలిసేందుకు మహిళ ఇంటికి వస్తుండడంతో మహిళకు అనుమానం వచ్చింది. అటువంటి పరిస్థితిలో, ఆమె తన కోడలుతో దీనిపై ఆగ్రహాం తెలపడంతో, నిందితుడు మహిళను హత్య చేశాడు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే