Viral: ఎయిర్‌పోర్టు తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల బిత్తరచూపులు.. బ్యాగులు చెక్ చేయగా

విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న జంతువులను కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్న ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను..

Viral: ఎయిర్‌పోర్టు తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల బిత్తరచూపులు.. బ్యాగులు చెక్ చేయగా
Airport
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 16, 2024 | 1:13 PM

విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న జంతువులను కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్న ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ట్రాలీ బ్యాగ్‌లోని 40 పెట్టెలలో ఓ పెద్ద తాబేలు, నక్షత్ర తాబేళ్లు, బల్లి, ఎర్ర ఎలుక లాంటి వివిధ రకాల జంతువులను స్వాధీనం చేసుకున్నారు.

ఇది చదవండి: మీరు పుట్టిన తేదీని బట్టి మీ వెనకున్న దేవుడెవరో చెప్పొచ్చు.! ఎలాగో తెల్సా

ఎయిర్‌పోర్టులో తనిఖీలు చేపడుతుండగా.. ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. కౌలాలంపూర్ నుంచి MHO192 విమానంలో దిగిన ఆ ఇద్దరు వ్యక్తులను అనుమానమొచ్చి తనిఖీ చేయగా.. జంతువులను అక్రమంగా తీసుకువచ్చినట్టు తేలింది. నిందితులపై అక్రమ జంతువుల రవాణా నిషేధ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: తస్సాదియ్యా.! పే..ద్ద టాస్కే ఇది.. పామును గుర్తిస్తే మీరే తెలివైనవారే

ఇక మరో కేసులో కిలోన్నర బంగారంతో పట్టుబడ్డాడు ఓ వ్యక్తి. కౌలాలంపూర్ నుంచి కెంపేగౌడ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఆ వ్యక్తి తన లోదుస్తుల్లో బంగారాన్ని దాచిపెట్టాడు. ఇక తనిఖీల్లో కస్టమ్స్ అధికారులు అతడి లోదుస్తుల్లో 1 కిలో 499 గ్రాముల బరువున్న కోటి విలువైన బంగారు బిస్కెట్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, నిందితుడిని 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కోర్టు ఆదేశించింది.

Trending

 

ఇది చదవండి: బాబోయ్.. అది రోడ్డు కాదు భారీ కొండచిలువ.. పట్టు జారితే పరలోకానికే

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..