కిమ్ గురించి మరో షాకింగ్ నిజం.. నార్త్ కొరియాలో కలకలం..

నార్త్ కొరియా అధ్యక్షుడు, నియంత కిమ్ జోంగ్ ఉన్… ఈ పేరు ఓ బ్రాండ్.. చూడడానికి జానడే ఉన్నా.. తన చేష్టలు, చర్యలతో ఏకంగా అగ్రరాజ్యాన్ని సైతం భయపెట్టారు ఈ డిక్టేటర్. కొన్ని రోజుల క్రితం అసలు కిమ్ బ్రతికి ఉన్నారా.. చనిపోయారా అని సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం జరిగింది. ఇక ఆ తర్వాత అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఓ పరిశ్రమను ప్రారంభించే ఫంక్షన్‌కు కిమ్ విచ్చేశారని ఆ దేశ మీడియాలో వార్తలు వెల్లువెత్తాయి. అంతేకాక రీసెంట్‌గా […]

కిమ్ గురించి మరో షాకింగ్ నిజం.. నార్త్ కొరియాలో కలకలం..
Follow us

|

Updated on: May 22, 2020 | 11:47 PM

నార్త్ కొరియా అధ్యక్షుడు, నియంత కిమ్ జోంగ్ ఉన్… ఈ పేరు ఓ బ్రాండ్.. చూడడానికి జానడే ఉన్నా.. తన చేష్టలు, చర్యలతో ఏకంగా అగ్రరాజ్యాన్ని సైతం భయపెట్టారు ఈ డిక్టేటర్. కొన్ని రోజుల క్రితం అసలు కిమ్ బ్రతికి ఉన్నారా.. చనిపోయారా అని సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం జరిగింది. ఇక ఆ తర్వాత అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఓ పరిశ్రమను ప్రారంభించే ఫంక్షన్‌కు కిమ్ విచ్చేశారని ఆ దేశ మీడియాలో వార్తలు వెల్లువెత్తాయి. అంతేకాక రీసెంట్‌గా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లకు కిమ్ లేఖలు పంపించారన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి నార్త్ కొరియాలో కలకలం మొదలైంది. ఈ నియంత గత రెండు నెలలుగా బహిరంగ కార్యక్రమాలకు, సభలకు తక్కువగా హాజరువుతున్నట్లు తెలుస్తోంది. దానికి పలు రకాల కారణాలు బయటికొస్తున్నాయి.

Read This: కిమ్ మరణం వెనుక రహస్యమిదే.. దేశద్రోహులు గుర్తింపు.. వారికి చావే గతి!

తమ దేశంలో ఒక్క కరోనా కేసు కూడా లేదని బహిరంగంగా చెప్పిన ఉత్తర కొరియా ఇప్పుడు వైరస్ నివారణ చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఏప్రిల్, మే నెలల్లో కిమ్ ఇప్పటివరకు కేవలం 4 సార్లు మాత్రమే బహిరంగ సభలకు హాజరయ్యారు. గతేడాదితో పోలిస్తే ఈ గణాంకాలు చాలా తక్కువ. 2011లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి, కిమ్ అతి తక్కువ బహిరంగంగా కనిపించింది కేవలం 2017 సంవత్సరంలో మాత్రమే. ఉత్తర కొరియాను ట్రాక్ చేసే సియోల్ ఆధారిత సంస్థ కొరియా రిస్క్ గ్రూప్ CEO చాడ్ ఓ కార్రోల్ “ఇది సాధారణమైన విషయం కాదు” అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Also Read: కిమ్ లైఫ్‌స్టైల్ గురించి తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే!

25.5 మిలియన్ల ప్రజలతో శక్తివంతమైన నాయకుడిగా , అణ్వాయుధ ఆయుధాల ప్రాప్యతకు కిమ్ పెట్టింది పేరు. ఆయన ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడూ అంతర్జాతీయ సమాజం తెలుసుకుంటూనే ఉంది. సాధారణంగా ఉత్తర కొరియా చాలా హై సెక్యూరిటీ కలిగిన దేశం.. ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా బయటికి రాదు. అందులోనూ కిమ్‌ గురించి తెలుసుకోవడం అసాధ్యం. ఆ దేశ అధికారులు మాత్రం కరోనా వైరస్ కారణంగా కిమ్ పరిమిత సంఖ్యలో బహిరంగ సభలకు హాజరవుతున్నారని.. అంతేకాకుండా మరొకొన్నింటిని పూర్తిగా రద్దు చేశామని అన్నారు. కాగా, దక్షిణ కొరియా ఏకీకరణ మంత్రిత్వ శాఖ శుక్రవారం నార్త్ కొరియా పరిస్థితిని పర్యవేక్షించి కిమ్ బయట తక్కువగా కనిపిస్తున్నారని గుర్తించింది.

ఇది చదవండి: విద్యార్ధులకు గుడ్ న్యూస్.. జూన్‌ 20 నుంచి బీటెక్ పరీక్షలు..