AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొవిడ్-19 : గృహ నిర్బంధంలోకి వెళ్లిన మరో ప్రధాని..!

ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా రాకాసి దేశాధినేతలను సైతం వదలడంలేదు. తాజాగా మరో ప్రధానమంత్రి కరోనా ధాటికి క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. మలేసియా ప్రధానమంత్రి ముహిద్దీన్ యాసిన్ 14 రోజుల పాటు హోమ్‌ క్వారంటైన్‌లో ఉంటారని ఆయన కార్యాలయం శుక్రవారం ప్రకటించింది. ఈ వారం ఆయన అధికారిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. అయితే ప్రధాని యాసిన్ పాల్గొన్న ఓ సమావేశానికి హాజరైన ఒక అధికారికి కరోనా వైరస్ సోకినట్టు నిర్థారణ అయ్యింది. దీంతో స్వయంగా గృహ నిర్బంధంలో ఉండాలని ఆయన […]

కొవిడ్-19 : గృహ నిర్బంధంలోకి వెళ్లిన మరో ప్రధాని..!
Balaraju Goud
|

Updated on: May 22, 2020 | 9:49 PM

Share

ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా రాకాసి దేశాధినేతలను సైతం వదలడంలేదు. తాజాగా మరో ప్రధానమంత్రి కరోనా ధాటికి క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. మలేసియా ప్రధానమంత్రి ముహిద్దీన్ యాసిన్ 14 రోజుల పాటు హోమ్‌ క్వారంటైన్‌లో ఉంటారని ఆయన కార్యాలయం శుక్రవారం ప్రకటించింది. ఈ వారం ఆయన అధికారిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. అయితే ప్రధాని యాసిన్ పాల్గొన్న ఓ సమావేశానికి హాజరైన ఒక అధికారికి కరోనా వైరస్ సోకినట్టు నిర్థారణ అయ్యింది. దీంతో స్వయంగా గృహ నిర్బంధంలో ఉండాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని ముహిద్దీన్ యాసిన్‌కు కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహించిన వైద్యులు మాత్రం ఆయనకు కొవిడ్ సోకలేదని తేల్చారు. అయితే ఈ సమావేశంలో పాల్గొన్న సభ్యులందరూ స్క్రీనింగ్ చేయించుకుని, హోమ్‌ క్వారైంటన్‌లో ఉండాలని ఆదేశించినట్టు ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. గతంలో బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌ కరోనా వైరస్‌ మహమ్మారి బారిన పడి కోలుకున్నారు. ముందుగా హోం క్వారంటైన్‌లోకి వెళ్లిన ఆయన్ను.. ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందించారు. కాగా, కోవిడ్‌-19 సోకడంతో స్పానిష్‌ రాణి మారియా థెరిసా ప్రాణాలు కోల్పోయింది. దీంతో మలేషియా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Follow Us
రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం
రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం