AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Third Wave Tension: థర్డ్ వేవ్‌పై టెన్షన్.. టెన్షన్.. చిన్నారుల విషయంలో కేంద్రం తాజా మార్గదర్శకాలివే..!

ఇలాంటి సమయంలో వీరితో పాటు కోవిడ్‌ బారినపడిన వారి పిల్లల సంరక్షణపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కరోనా వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్న చిన్నారుల సంరక్షణ బాధ్యతలను చేపట్టాలని తెలియజేస్తూ కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ...

Third Wave Tension: థర్డ్ వేవ్‌పై టెన్షన్.. టెన్షన్.. చిన్నారుల విషయంలో కేంద్రం తాజా మార్గదర్శకాలివే..!
Corona Third Wave
Rajesh Sharma
|

Updated on: Jun 03, 2021 | 6:56 PM

Share

Third Wave Tension Government guidelines for Children: దేశంలో సెకెండ్ వేవ్ కరోనా వైరస్(SECOND WAVE CORONA VIRUS) విజృంభణ ఇంకా తగ్గకముందే.. థర్డ్ వేవ్ చింత మొదలైంది. థర్డ్ వేవ్‌లో చిన్నారులపైనే కరోనా (CORONA) ప్రభావం ఎక్కువగా వుంటుందన్న భయాందోళన దేశప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం (UNION GOVERNMENT) చిన్నారుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రతలను, మార్గదర్శకాలను (GUIDELINES) విడుదల చేసింది. థర్డ్ వేవ్‌ విషయంలో అప్రమత్తంగా వుండాలని కేంద్ర కుటుంబ, ఆరోగ్య శాఖ (UNION FAMILY HEALTH MINISTRY) నిర్దేశించింది. ప్రస్తుతం కరోనా వైరస్‌ సృష్టిస్తోన్న విలయంతో దేశవ్యాప్తంగా ఎంతోమంది చిన్నారులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. దేశంలో కరోనా కారణంగా దాదాపు 1882 మంది చిన్నారులు తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయి అనాథలైనట్లు జాతీయ బాలల హక్కుల సంఘం (NATIONAL CHILD RIGHTS COMMISSION) గణాంకాలను విడుదల చేసింది. ఇక తల్లి దండ్రుల్లో ఎవరో ఒకర్ని కోల్పోయిన చిన్నారుల సంఖ్య 7464కు చేరింది. ఇలా ఏడాది కాలంలో దాదాపు 9346 మంది పిల్లలు కరోనా విలయానికి బాధితులుగా మిగిలిపోయారు.

ఇలాంటి సమయంలో వీరితో పాటు కోవిడ్‌ (COVID-19) బారినపడిన వారి పిల్లల సంరక్షణపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కరోనా వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్న చిన్నారుల సంరక్షణ బాధ్యతలను చేపట్టాలని తెలియజేస్తూ కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి రామ్‌ మోహన్‌ మిశ్రా (RAM MOHAN MISHRA) అన్ని రాష్ట్రాల ముఖ్యకార్యదర్శులకు లేఖలు పంపారు. అన్ని రాష్ట్రాలు, కలెక్టర్లు (COLLECTORS), పోలీస్‌ (POLICE), పంచాయితీరాజ్‌తో పాటు పట్టణ స్థానిక సంస్థలు ఈ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

మార్గదర్శకాలివే…

కరోనాతో తల్లిదండ్రులను కోల్పోవడంతో డిప్రెషన్‌ (DIPRESSION)లో ఉన్న చిన్నారులను గుర్తించేందుకు ప్రత్యేకంగా సర్వే నిర్వహించాలి. ప్రతి చిన్నారి ప్రొఫైల్‌తో పాటు వారి అవసరాలను డేటాబేస్‌లో పేర్కొనాలి. తర్వాత వాటిని ట్రాక్‌ చైల్డ్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి. కరోనా వైరస్‌ వల్ల తల్లిదండ్రులు అనారోగ్యంపాలైతే.. అలాంటి వారికోసం తాత్కాలికంగా చైల్డ్‌ కేర్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా సంరక్షకులు లేని పిల్లలకు సాయమందించాలి. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు ఇబ్బందులు ఎదురైతే వారి పిల్లల బాధ్యతను చూసుకునే గార్డియన్ల వివరాలను సేకరించాలి. ఇందుకోసం ఆసుపత్రిలో చేరిక సమయంలో నమోదు చేసుకునే వివరాలతోపాటు వీటిని కూడా ఆసుపత్రి సిబ్బంది నమోదుచేసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర మహిళాశిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ సూచించింది.

డిప్రెషన్‌లో ఉన్న చిన్నారులకు పిల్లల సంరక్షణ సేవా పథకం కింద ఇప్పటికే అందుబాటులో ఉన్న కేంద్రాలో తాత్కాలికంగా వసతి కల్పించాలి. కోవిడ్‌తో బాధపడుతున్న పిల్లలకు చైల్డ్‌ కేర్‌ కేంద్రాల్లోనే ప్రత్యేక ఐసోలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. ఆయా కేంద్రాలను సందర్శించి, బాధిత పిల్లలతో సంభాషించే మానసిక నిపుణులు, కౌల్సిలర్ల జాబితాను రెడీ చేయాలి. కుంగుబాటులో ఉన్న పిల్లలకు మానసికంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు స్థానికంగా హెల్ప్‌లైన్‌ నంబర్‌ను ప్రారంభించాలని రాష్ట్రాలకు సూచించింది. వీటిలో మానసిక నిపుణులు అందుబాటులో ఉంచాలి. కోవిడ్‌ కారణంగా తీవ్రంగా ఎఫెక్టైన పిల్లల సంరక్షణ బాధ్యతలను ఆయా జిల్లా కలెక్టర్లు తీసుకోవాలి. ముఖ్యంగా జువెనైల్‌ జస్టిస్‌ యాక్ట్‌-2015 ప్రకారం, అలాంటి చిన్నారులకు వసతి కల్పించేలా కలెక్టర్లు కృషి చేయాలని కేంద్రం సూచించింది.

బాధిత పిల్లల అవసరాలను సూపర్ వైజ్ చేయడానికి.. వారికి అన్ని రకాల ప్రయోజనాలను అందించడానకి డిస్ట్రిక్ట్ లెవెల్లో టాస్క్‌ఫోర్సులను ఏర్పాటు చేయాలి. కోవిడ్‌తో ప్రభావితమైన కుటుంబాల్లో కుటుంబ ఆస్తులు, వంశపారపర్యంగా వచ్చే ఆస్తులపై పిల్లలకు ఉన్న హక్కులను కాపాడే విధంగా జిల్లా కలెక్టర్లు చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా అలాంటి ఆస్తులను అమ్మడం లేదా ఆక్రమణకు గురికాకుండా రక్షణ కల్పించాలి. ఇందుకోసం రిజిస్ట్రేషన్‌, రెవెన్యూ శాఖలతో వీటిని పర్యవేక్షించాలి. అనాథలుగా మారిన చిన్నారులను చట్ట విరుద్ధంగా దత్తత తీసుకోవడం, అక్రమ రవాణా, బాల్య వివాహాలు, బాల కార్మికులపై ప్రత్యేక టీములతో పోలీస్‌ విభాగం అప్రమత్తంగా ఉంటూ పర్యవేక్షించాలి. దత్తత తీసుకుంటామంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రకటించే వారిని ట్రేస్‌ చేసి వారిపై చర్యలు తీసుకోవాలి. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన వారి వివరాలను మునిసిపాలిటీలు, పంచాయితీల స్థాయిలో ఏర్పాటైన బాలల సంక్షేమ కమిటీలు ఎప్పటికప్పుడు జిల్లా శిశు సంరక్షణ కేంద్రాలకు తెలియజేయాలి. కరోనా వల్ల అనాథలైన చిన్నారులకు ప్రభుత్వ పాఠశాలలు లేదా రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఉచిత విద్య అందేలా చూడాలి. ఒకవేళ పిల్లలు ప్రైవేటు స్కూల్‌లో చుదువుతుంటే విద్యాహక్కు చట్టం కింద వారి ఫీజుల భారాన్ని తగ్గించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అర్హత కలిగిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ స్కాలర్‌షిప్‌ పథకాలు అమలు అయ్యేట్లు చూడాలి.

ALSO READ: సెకెండ్ వేవ్ ఎండ్‌పై సంచలన ప్రకటన.. ఇప్పుడప్పుడే తగ్గదంటున్న కొత్త అధ్యయనం

ALSO READ: పీసీసీ అధ్యక్షుల ఎంపికపై తుదిదశకు కసరత్తు.. ఈ వారమే ప్రకటించనున్న హైకమాండ్