AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SECOND WAVE: సెకెండ్ వేవ్ ఎండ్‌పై సంచలన ప్రకటన.. ఇప్పుడప్పుడే తగ్గదంటున్న కొత్త అధ్యయనం

దేశాన్ని కరోనా సెకెండ్ వేవ్ కుదిపేస్తోంది. ఏప్రిల్, మే నెలలతో పోలిస్తే ప్రస్తుతం కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నా.. తాజాగా వెల్లడైన ఓ అధ్యయనం షాకింగ్ అంశాలను వెల్లడించింది.

SECOND WAVE: సెకెండ్ వేవ్ ఎండ్‌పై సంచలన ప్రకటన.. ఇప్పుడప్పుడే తగ్గదంటున్న కొత్త అధ్యయనం
Corona
Rajesh Sharma
| Edited By: Team Veegam|

Updated on: Jun 03, 2021 | 3:45 PM

Share

SECOND WAVE CORONA NEW STUDY REPORT: దేశాన్ని కరోనా సెకెండ్ వేవ్ కుదిపేస్తోంది. ఏప్రిల్, మే నెలలతో పోలిస్తే ప్రస్తుతం కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నా.. తాజాగా వెల్లడైన ఓ అధ్యయనం షాకింగ్ అంశాలను వెల్లడించింది. కరోనా సెకెండ్ వేవ్ కొన్ని రాష్ట్రాలలో తగ్గుముఖం పట్టినా.. ఎనిమిది రాష్ట్రాలలో జూలై నుంచి సెప్టెంబర్ దాకా కొనసాగే ప్రమాదం వుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఈ ఎనిమిది రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కూడా వుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఏపీలో ప్రతీ రోజూ పది వేలకు పైగానే కరోనా కేసులు నమోదవుతున్నాయి.

ఏపీ రాజధానిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రొఫెసర్, వైస్ చాన్స్‌లర్ డి.నారాయణ రావు పేరిట ఓ అధ్యయనం వెలువడింది. అందులోని అంశాలు ఒకింత షాక్ నిచ్చేవిగా వున్నాయి. నారాయణ రావు సారథ్యంలోని బ‌‌ృందం సస్పెక్టబుల్, ఇన్ఫెక్టెడ్, రికవరీ మోడల్ సాయంతో ర్యాండమ్ ఫారెస్టు మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్ డేటాను క్షుణ్ణంగా పరిశీలించింది. ఈ విధానంలో వైరస్ వ్యాప్తి, వేగం, తీవ్రతతోపాటు రికవరీలను అంఛనా వేశారు. ఏపీతోపాటు ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో నమోదవుతున్న రోజూవారీ కేసులను పరిశీలించారు.

ఈ బ‌ృందం అంఛనా వేసిన తేదీకి కాస్త అటు ఇటుగా ఢిల్లీ, యూపీల్లో కరోనా సెకెండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. కర్నాటకలో జులై ఒకటో తేదీనాటికి కరోనా సెకెండ్ వేవ్ తగ్గుముఖం పడుతుందని ప్రొ. నారాయణ రావు టీమ్ చెబుతోంది. మహారాష్ట్రలో జులై 13 నాటికి, ఏపీలో జులై 16వ తేదీ నాటికి సెకెండ్ వేవ్ తగ్గుతుందని ఈ బ‌ృందం అంఛనా వేసింది. తమిళనాడులో జులై 26 నాటికి, కేరళలో ఆగస్టు 12 నాటికి, బెంగాల్‌లో సెప్టెంబర్ 2వ తేదీ నాటికి కరోనా సెకెండ్ వేవ్ తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు. తమిళనాడు, కేరళ, బెంగాల్ రాష్ట్రాలలో భారీ జనాలతో ఉత్సవాలు, కార్యక్రమాలు నిర్వహించడం వల్ల సెకెండ్ వేవ్ మరి కొంత కాలం కొనసాగినా ఆశ్చర్యపోనక్కర లేదని నారాయణ రావు టీమ్ అంటోంది. ప్రొ. నారాయణ రావు సారథ్యంలోని బృందంలో ఫిజిక్స్ ప్రొఫెసర్ సౌమ్యజ్యోతి బిశ్వాస్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థులు అన్వేష్ రెడ్డి, హనేశ్, సుహారెడ్డి, సాయికృష్ణ వున్నారు.

ALSO READ: పీసీసీ అధ్యక్షుల ఎంపికపై తుదిదశకు కసరత్తు.. ఈ వారమే ప్రకటించనున్న హైకమాండ్