SDG Index: సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన సూచికలో టాప్ 5లో నిలిచిన ఆంధ్రప్రదేశ్.. మొదటి స్థానంలో ఏ రాష్ట్రమంటే..

Sustainable Development Goals Index: సుస్థిర ఆర్థికాభివృద్ధి(2020–21)కి సంబంధించి రాష్ట్రాలవారీగా ర్యాంకులు విడుదల చేసింది నీతి ఆయోగ్.

SDG Index: సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన సూచికలో టాప్ 5లో నిలిచిన ఆంధ్రప్రదేశ్.. మొదటి స్థానంలో ఏ రాష్ట్రమంటే..
Niti Ayog
Follow us

|

Updated on: Jun 03, 2021 | 3:44 PM

Sustainable Development Goals Index: సుస్థిర ఆర్థికాభివృద్ధి(2020–21)కి సంబంధించి రాష్ట్రాలవారీగా ర్యాంకులు విడుదల చేసింది నీతి ఆయోగ్. పలు అంశాల్లో మంచి పనితీరు కనపరిచినందుకు ఆయా రాష్ట్రాలకు ర్యాంకులు కేటాయించింది. నీతి ఆయోగ్ విడుదల చేసిన తాజా ర్యాంకుల్లో మొదటి ఐదు రాష్ట్రాల్లో ఏపీ చోటు దక్కించుకుంది. ఇక ఈ జాబితాలో బిహార్ చివరలో నిలిచింది. సామాజిక, ఆర్థిక, పర్యావరణ అంశాలకు సంబంధించి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పురోగతిని సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచిక (ఎస్‌డిజి) అంచనా వేస్తుంది. ఈ నివేదికలో 75 పాయింట్లతో కేరళ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. ఆ తరువాత హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు 74 స్కోరుతో రెండవ స్థానంలో నిలిచాయి. 72 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడవ స్థానంలో ఉంది. బీహార్, జార్ఖండ్, అస్సాం రాష్ట్రాలు ఈ ర్యాంకింగ్స్‌లో అట్టడుగున నిలిచాయి. కాగా, భారత ఎస్‌డిజి ఇండెక్స్ రిపోర్ట్‌ను నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ గురువారం నాడు విడుదల చేశారు.

“ఎస్‌డిజి ఇండియా ఇండెక్స్, డాష్‌బోర్డ్ ద్వారా ఎస్‌డిజిలను పర్యవేక్షించే మా ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా గుర్తించబడింది, ప్రశంసించబడింది. ఎస్‌డిజిలపై మిశ్రమ సూచికను లెక్కించడం ద్వారా మన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పని తీరును అంచనా వేసి ర్యాంకులు ఇవ్వడానికి అరుదైన డేటా ఆధారిత ప్రయత్నంగా నిలిచింది.’’ అని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.

‘‘మొట్టమొదట 2018 డిసెంబర్‌లో ప్రారంభించిన ఈ సూచిక దేశంలోని ఎస్‌డిజిలపై పురోగతిని పర్యవేక్షించే ప్రాథమిక సాధనంగా మారింది. అలాగే ప్రపంచ లక్ష్యాలపై ర్యాంకింగ్ ఇవ్వడం ద్వారా ఏకకాలంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య పోటీని పెంచింది.’’ అని ఆయన చెప్పుకొచ్చారు.

Also read:

Gomukhasana: నిద్రలేమి సమస్య, కిడ్నీ స్టోన్స్ తో బాధపడుతున్నారా.. అయితే ఈ ఆసనాన్ని ట్రై చేస్తే సరి…