karnataka lockdown: కర్ణాటకలో తగ్గని కరోనా ఉధృతి.. మరోసారి లాక్‌డౌన్‌ పొడిగింపు..

Lockdown in Karnataka: కర్ణాటకలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో ఆ రాష్ట్రంలో మరోసారి లాక్‌డౌన్ పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 14వ తేదీ

karnataka lockdown: కర్ణాటకలో తగ్గని కరోనా ఉధృతి.. మరోసారి లాక్‌డౌన్‌ పొడిగింపు..
2008 నుంచి సీఎం పదవిలో మూడున్నర ఏళ్లు సీఎంగా పని చేశారు యడియూరప్ప. 2008 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దీంతో 2008 మే 30న యడియూరప్ప రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో యడియూరప్ప పాత్రపై కర్ణాటక లోకాయుక్తా దర్యాప్తు జరిపి 2011లో నివేదిక సమర్పించింది. దీంతో బీజేపీ అధిష్ఠానం నుంచి ఆయనపై ఒత్తిడి రావడంతో మూడున్న ఏండ్ల పాలన తర్వాత 2011 జూలై 31న సీఎం పదవికి రాజీనామా చేశారు.
Follow us

|

Updated on: Jun 03, 2021 | 6:44 PM

Lockdown in Karnataka: కర్ణాటకలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో ఆ రాష్ట్రంలో మరోసారి లాక్‌డౌన్ పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 14వ తేదీ వరకూ లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప గురువారం ప్రకటించారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉందని.. కోవిడ్ -19 సెకండ్ వేవ్ గ్రామీణ ప్రాంతాలకు సైతం వ్యాపించిందని దీంతో జూన్ 14 వరకు లాక్‌డౌన్ గడువును పొడిగిస్తున్నట్లు యడియూరప్ప తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఆయన రెండు రోజుల నుంచి అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. పాజిటివ్ కేసులు తగ్గకపోవడం వల్ల లాక్‌డౌన్ ను పెంచాలని టాస్క్‌ఫోర్స్ బృందం ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది.

అనంతరం గురువారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి యడియూరప్ప ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తి కట్టడి కోసం లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప పేర్కొన్నారు. రాష్ట్రంలో కేసులు అదుపులోకి రాలేదని.. దీంతో లాక్‌డౌన్‌ను పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న లాక్‌డౌన్‌ నిబంధనలే కొనసాగుతాయని ఆయన స్పష్టంచేశారు. జూన్ 7 వరకూ ఉన్న లాక్‌డౌన్‌ను 14 వరకూ పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు.

కాగా.. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మే 24 నుంచి రాష్ట్రంలో కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.. కొన్ని వ్యాపారాల నిర్వహణకు ప్రభుత్వం సడలింపులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదిలాఉంటే.. కర్ణాటకలో కరోనావైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 30,000 దాటింది. బుధవారం రాష్ట్రంలో 463 మంది కరోనా కారణంగా మరణించగా.. 16,387 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 26,35,122 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,93,024 యాక్టివ్ కేసులున్నాయి.

Also Read:

Leopard: కోతి కాదు చిరుతే.. చెట్లపై యమ జంపింగ్‌లు చేస్తున్న చిరుత.. చూస్తే షాకే.. వీడియో

TS EAMCET 2021: టీఎస్ ఎంసెట్ ద‌ర‌ఖాస్తు గ‌డువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటివరకంటే..?