కరోనాను జయించిన పది నెలల బాలుడు

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రంగా ప్రబలుతోంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరికీ ఈ వ్యాధి వ్యాప్తి చెందుతూనే ఉంది. పలువురు ఈ వైరస్ ధాటికి మరణిస్తుంటే.. మరికొందరు కరోనాను జయిస్తున్నారు. తాజాగా తమిళనాడులో ఓ పది నెలల బాలుడు కరోనా మహమ్మారిని ఎదుర్కొన్నాడు. కోయంబత్తూరులోని ఈఎస్‌ఐ హాస్పిటల్‌లో చికిత్స పొందిన ఈ చిన్నారికి మళ్లీ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ అని తేలడంతో సోమవారం డిశ్చార్జ్ చేశారు. ఆ బాలుడి తల్లి రైల్వే డాక్టర్‌గా […]

కరోనాను జయించిన పది నెలల బాలుడు
Follow us

| Edited By:

Updated on: Apr 07, 2020 | 6:38 PM

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రంగా ప్రబలుతోంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరికీ ఈ వ్యాధి వ్యాప్తి చెందుతూనే ఉంది. పలువురు ఈ వైరస్ ధాటికి మరణిస్తుంటే.. మరికొందరు కరోనాను జయిస్తున్నారు. తాజాగా తమిళనాడులో ఓ పది నెలల బాలుడు కరోనా మహమ్మారిని ఎదుర్కొన్నాడు. కోయంబత్తూరులోని ఈఎస్‌ఐ హాస్పిటల్‌లో చికిత్స పొందిన ఈ చిన్నారికి మళ్లీ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ అని తేలడంతో సోమవారం డిశ్చార్జ్ చేశారు. ఆ బాలుడి తల్లి రైల్వే డాక్టర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో మొదటగా తల్లికి కరోనా సోకగా.. తర్వాత తల్లి నుంచి ఆ పసివాడికి కోవిడ్ సోకింది. 15 రోజులు ఐసోలేషన్‌లో ఉంచిన అనంతరం ఆ బాలుడితో పాటు అతడి తల్లి శాంపిళ్లను రెండు సార్లు పరీక్షించగా నెగిటివ్ అని తేలింది. దీంతో వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు వైద్యులు. అలాగే వీరిని 28 రోజుల పాలు హోమ్ క్వారంటైన్లో ఉండాలని ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. కాగా కోయంబత్తూర్‌ జిల్లాలో ఇప్పటివరకూ కోవిడ్ కేసుల సంఖ్య 59కి చేరింది.

ఇవి కూడా చదవండి:

చేతల్లోకి దిగండంటూ.. సీఎంపై గౌతమ్ గంభీర్ ఫైర్

హైదరాబాద్‌ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో తొలి కరోనా కేసు

ఇంకో వంద కరోనా కేసులు పెరగొచ్చు: సీఎం కేసీఆర్

బ్రేకింగ్: లాక్‌డౌన్‌ని కొనసాగించాలని ప్రధానిని కోరుతున్నా

సొంతూరికి వెళ్లడానికి శవం గెటప్.. ఐదుగురిపై కేసు

గాంధీ ఆసుపత్రిలో ‘కరోనా రోగి’ అదృశ్యం.. అసలేం జరిగిందంటే!

Latest Articles