హైదరాబాద్‌ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో తొలి కరోనా కేసు

తాజాగా కరోనా వైరస్ పోలీస్ శాఖకూ పాకింది. సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీన్ని పోలీస్ ఉన్నతాధికారులు ధృవీకరించారు. దీనితో అప్రమత్తమైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ..

హైదరాబాద్‌ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో తొలి కరోనా కేసు
Follow us

| Edited By:

Updated on: Apr 07, 2020 | 2:48 PM

ప్రస్తుతం దేశ వ్యాప్తంగానే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు ముస్లింలు వెళ్లివచ్చిన తరువాత నుంచి కరోనా కేసులు మరింత ఎక్కువవుతున్నాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరికీ ఈ వైరస్ వ్యాపిస్తూనే ఉంది. అలాగే కరోనా రోగులకు వైద్యం అందిస్తోన్న పలువురు డాక్టర్లు, నర్సులకు కూడా కోవిడ్ సోకుతోంది.

తాజాగా ఇప్పుడు ఈ కరోనా వైరస్ పోలీస్ శాఖకూ పాకింది. సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీన్ని పోలీస్ ఉన్నతాధికారులు ధృవీకరించారు. దీనితో అప్రమత్తమైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న 12 మంది సిబ్బందిని, 10 మంది కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. కాగా.. ఇప్పటివరకూ రాష్ట్రంలో 364 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 11 మంది చనిపోయారు.

ఇవి కూడా చదవండి:

ఇంకో వంద కరోనా కేసులు పెరగొచ్చు: సీఎం కేసీఆర్

బ్రేకింగ్: లాక్‌డౌన్‌ని కొనసాగించాలని ప్రధానిని కోరుతున్నా

సొంతూరికి వెళ్లడానికి శవం గెటప్.. ఐదుగురిపై కేసు

గాంధీ ఆసుపత్రిలో ‘కరోనా రోగి’ అదృశ్యం.. అసలేం జరిగిందంటే!

దేవాలయాల్లో క్వారంటైన్ కేంద్రాలా? మరెక్కడా చోటు లేదా?

ప్రముఖ నిర్మాత కుమార్తెకు కరోనా పాజిటివ్