AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: షూటింగ్ సెట్ నుంచి హీరోయిన్ కిడ్నాప్.. తల నరికి బస్సులో నుంచి పడేసి.. ఇండస్ట్రీని షేక్ చేసిన రియల్ స్టోరీ..

నిమాను తలపించే రియల్ స్టోరీ.. 2012లో యావత్ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన ఘటన. ఇప్పటికీ ఆమె మరణం బాలీవుడ్ ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేస్తుంది. తోటీ కళాకారులే ఆ నటిని దారుణంగా హత్య చేశారని తెలిసి పోలీసులే నిర్ఘాంతపోయారు. ఆ నటి పేరు మీనాక్షి థాపా. 1984 అక్టోబర్ 4న నేపాల్‌లో జన్మించి డెహ్రాడూన్‌లో పెరిగింది. చదువుకుంటున్న సమయంలోనే నటనపై ఆసక్తితో ముంబైకి చేరుకుంది.

Tollywood: షూటింగ్ సెట్ నుంచి హీరోయిన్ కిడ్నాప్.. తల నరికి బస్సులో నుంచి పడేసి.. ఇండస్ట్రీని షేక్ చేసిన రియల్ స్టోరీ..
Meenakshi Thapa
Rajitha Chanti
| Edited By: |

Updated on: May 06, 2024 | 12:05 PM

Share

నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో ఆశలతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ నెమ్మదిగా ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అప్పుడప్పుడే వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారుతున్న సమయంలోనే ఊహించిన ఘటన ఆమె జీవితానికి ముగింపు పలికింది. షూటింగ్ సెట్ నుంచి ఆ నటిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు. గొంతు కోసి.. ఆపై తల నరికి బస్సులో నుంచి పడేశారు. ఇదంతా సినిమా స్టోరీ కాదు.. సినిమాను తలపించే రియల్ స్టోరీ.. 2012లో యావత్ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన ఘటన. ఇప్పటికీ ఆమె మరణం బాలీవుడ్ ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేస్తుంది. తోటీ కళాకారులే ఆ నటిని దారుణంగా హత్య చేశారని తెలిసి పోలీసులే నిర్ఘాంతపోయారు. ఆ నటి పేరు మీనాక్షి థాపా. 1984 అక్టోబర్ 4న నేపాల్‌లో జన్మించి డెహ్రాడూన్‌లో పెరిగింది. చదువుకుంటున్న సమయంలోనే నటనపై ఆసక్తితో ముంబైకి చేరుకుంది.

ముంబైలో డ్యాన్స్ శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది. 2011లో 404 సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ మూవీ తర్వాత ఆమెకు మధుర్ భండార్కర్ తెరకెక్కించిన హీరోయిన్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ చిత్రంలో కరీనా కపూర్ మెయిన్ లీడ్ రోల్ పోషించగా.. మరో కథానాయికగా మీనాక్షి కనిపించాల్సి ఉంది. అతి తక్కువ సమయంలో కరీనా వంటి స్టార్ హీరోయిన్ పక్కనే కీలకపాత్ర ఛాన్స్ రావడంతో చాలా సంతోషించింది. కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. హీరోయిన్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న మీనాక్షి.. ఓరోజు షూటింగ్ సెట్ నుంచి కిడ్నాప్ కు గురైంది. అప్పుడు ఆమె వయసు కేవలం 24 ఏళ్లు మాత్రమే. మీనాక్షి తన తల్లికి ఫోన్ చేసి తన సహనటుడు, స్నేహితుడు అమిత్ కుమార్ జైస్వాల్, ప్రీతి సూరిన్ లతో కలిసి అలహాబాద్ వెళ్తునట్లు చెప్పి ఫోన్ కట్ చేసింది . రెండు రోజులు గడిచినా ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆ తర్వాత ఆమె తల్లికి తెలియని నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. మీ అమ్మాయి క్షేమంగా ఉండాలంటే రూ. 15 లక్షలు ఇవ్వాలని.. పోలీసులకు చెబితే తమ కూతురి అసభ్యకర వీడియోలను బయటపెడతామని బెదిరంచారు. దీంతో పోలీసులను ఆశ్రయించగా.. ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది.

మీనాక్షిని ఆమె ఇద్దరు స్నేహితులు కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అలహాబాద్ లో ఆమెను బంధించి దారుణంగా హింసించారు. కొన్నాళ్లకు అమిత్, ప్రీతి సూరిన్ లను పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా.. మీనాక్షి హత్యోందంత వెలుగులోకి వచ్చింది. రూ. 15 లక్షలు చెల్లించిన తర్వాత వారు మీనాక్షి గొంతు కోసి హత్య చేసి.. ఆ తర్వాత ఆమె తల నరికి ముంబైకి తిరిగి వచ్చే దారిలో బస్సు కిటికిలో నుంచి బయట పడేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించారు. మీనాక్షి మృతదేహాన్ని కత్తిరించి వాటర్ ట్యాంక్ లో పడేశారు. అయితే మీనాక్షి తలను కానీ.. ఆమె బాడీని కానీ పోలీసులు కనిపెట్టలేకపోయారు. 2018లో అన్ని విచారణలు జరిగిన తర్వాత కోర్టు వారిద్దరికి జీవితఖైదు శిక్ష విధించింది.