- Telugu News Photo Gallery Cricket photos IPL 2024 Rcb Bowlers Conceded Just 23 Runs with 3 wickets In Powerplay Against Gujarat Titans
IPL 2024: పవర్ ప్లేలో ఆర్‌సీబీ బౌలర్ల భీభత్సం.. కట్‌చేస్తే.. గుజరాత్ ఖాతాలో చెత్త రికార్డ్..
IPL 2024: తొలి వికెట్ షాక్ నుంచి కోలుకోని గుజరాత్ జట్టు తొలి 6 ఓవర్లు అంటే పవర్‌ప్లే ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 23 పరుగులు మాత్రమే చేసింది. దీంతో పాటు ఈ ఎడిషన్‌లో పవర్‌ప్లేలో అత్యల్ప పరుగులు చేసిన జట్టుగా గుజరాత్ రికార్డు సృష్టించింది. అలాగే, బెంగళూరు బౌలర్లు కూడా పవర్ ప్లేలో తక్కువ పరుగులు ఇచ్చిన బౌలర్లుగా రికార్డులకు ఎక్కారు.
Updated on: May 05, 2024 | 8:35 AM

బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ 52వ మ్యాచ్‌లో ఆర్‌సీబీ, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 147 పరుగులకు ఆలౌటైంది.

పైన చెప్పుకున్నట్టుగానే ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు.. ఆర్‌సీబీ పేసర్ల ధాటికి తడబడింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన కెప్టెన్ శుభ్‌మాన్ గిల్, వృద్ధిమాన్ సాహా సింగిల్ డిజిట్‌కే అలసిపోయారు.

ఎప్పటిలాగే సాహా కేవలం 1 పరుగుకే సిరాజ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా 2 పరుగులకే ఇన్నింగ్స్ ముగించాడు.

మూడో స్థానంలో వచ్చిన సాయి సుదర్శన్ కూడా 6 పరుగులకే వెనుదిరిగాడు. దీంతో గుజరాత్ జట్టు 5.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 19 పరుగులు మాత్రమే చేసింది.

తొలి షాక్ నుంచి తేరుకోని గుజరాత్ జట్టు తొలి 6 ఓవర్లు అంటే పవర్‌ప్లే ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 23 పరుగులు మాత్రమే చేసింది. దీంతో పాటు ఈ ఎడిషన్‌లో పవర్‌ప్లేలో అత్యల్ప పరుగులు చేసిన జట్టుగా గుజరాత్ రికార్డు సృష్టించింది.

ఇలా మొత్తం ఎడిషన్‌లో చాలా సులువుగా పరుగులు ఇచ్చి ఎన్నో అవాంఛనీయ రికార్డులు సృష్టించిన ఆర్సీబీ పేసర్లు.. పవర్‌ప్లేలో గుజరాత్ జట్టుకు కేవలం 23 పరుగులే ఇచ్చి పవర్‌ప్లేలో అతి తక్కువ పరుగులు ఇచ్చిన జట్టుగా రికార్డు సృష్టించారు.




