- Telugu News Photo Gallery Cricket photos Royal Challengers Bangalore Key Player Virat Kohli Comes With Smartphone after RCB vs GT Match check price details in ipl 2024
Virat Kohli Phone: కింగ్ కోహ్లీ ఏ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తాడు.. ధర ఎంతో తెలుసా? వైరలవుతోన్న ఫొటోస్
Virat Kohli Smartphone Price: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శన చేసి గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 42 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్ ఆధారంగానే కోహ్లి ఆరెంజ్ క్యాప్‌ని అందుకున్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో మహ్మద్ సిరాజ్‌తో కోహ్లీ మాట్లాడుతూ కనిపించాడు. ఈ సమయంలో అతని చేతిలో స్మార్ట్‌ఫోన్ కనిపించింది.
Updated on: May 05, 2024 | 12:59 PM

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శన చేసి గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 42 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్ ఆధారంగానే కోహ్లి ఆరెంజ్ క్యాప్‌ని అందుకున్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో మహ్మద్ సిరాజ్‌తో కోహ్లీ మాట్లాడుతూ కనిపించాడు. ఈ సమయంలో అతని చేతిలో స్మార్ట్‌ఫోన్ కనిపించింది.

కోహ్లీకి సంబంధించిన ప్రతి సమాచారంపై ఆయన అభిమానులు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే కోహ్లీ ఏ స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నాడో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

మీడియా కథనాల ప్రకారం కోహ్లీ ఐఫోన్‌ను వాడుతున్నాడు. అతని చేతిలో కనిపించిన ఫోన్ కూడా ఐఫోన్. దానిపై మెటల్ కవర్ కూడా ఉంది.

కోహ్లి స్మార్ట్ ఫోన్ ధర రూ.1.5 లక్షల కంటే ఎక్కువగా ఉంటుంది. ఐఫోన్‌లు అనేక రకాల శ్రేణుల్లో అందుబాటులో ఉన్నాయి. అయితే కోహ్లి స్మార్ట్ ఫోన్ చాలా ఖరీదైనదని అంటున్నారు.

ఐపీఎల్ 2024లో అత్యధిక పరుగులు చేసిన పరంగా కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. 11 మ్యాచ్‌లు ఆడి 542 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో కోహ్లి ఒక సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు చేశాడు.




