షాకింగ్‌.. పాజిటివ్‌ ఉన్న తబ్లిఘీ జమాతే సభ్యుడు ఆస్పత్రి నుంచి పరార్‌..!

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా వణికిస్తుందో అందరికీ తెలిసిందే. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటికే వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా… లక్షల మంది ఆస్పత్రి పాలయ్యారు. ఇక మన దేశంలో కూడా ఇప్పటికే నాలుగు వేల మందికి పైగా ఈ వైరస్‌ సోకి ఆస్పత్రిపాలయ్యారు. మరో వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే అకస్మాత్తుగా మర్కజ్‌ వ్యవహారం తెరపైకి రావడంతో.. ఈ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోయింది. అంతేకాదు.. ఈ మీటింగ్‌కు హాజరైన తబ్లిఘీ జమాతే సభ్యులు […]

షాకింగ్‌.. పాజిటివ్‌ ఉన్న తబ్లిఘీ జమాతే సభ్యుడు ఆస్పత్రి నుంచి పరార్‌..!
Follow us

| Edited By:

Updated on: Apr 07, 2020 | 4:59 PM

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా వణికిస్తుందో అందరికీ తెలిసిందే. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటికే వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా… లక్షల మంది ఆస్పత్రి పాలయ్యారు. ఇక మన దేశంలో కూడా ఇప్పటికే నాలుగు వేల మందికి పైగా ఈ వైరస్‌ సోకి ఆస్పత్రిపాలయ్యారు. మరో వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే అకస్మాత్తుగా మర్కజ్‌ వ్యవహారం తెరపైకి రావడంతో.. ఈ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోయింది. అంతేకాదు.. ఈ మీటింగ్‌కు హాజరైన తబ్లిఘీ జమాతే సభ్యులు అన్ని రాష్ట్రాల్లోని గ్రామాలకు పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌లో వెళ్లడం.. వెళ్లిన వారిలో ఎక్కువ మందికి పాజిటివ్ ఉండటం కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. అయితే అక్కడి వెళ్లి వచ్చిన వారిని క్వారంటైన్‌లో ఉంటూ.. సమీప అధికారులకు వివరాలు చెబుతూ.. అవసరమైతే ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవాలని ప్రభుత్వాలు ఆదేశించాయి. అయితే వీరిలో కొందరి సభ్యుల తీరు విస్మయానికి గురిచేస్తోంది.

తాజాగా.. యూపీలోని ఓ వ్యక్తి.. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌లో హాజరై వచ్చాడు. అయితే అతడికి పాజిటివ్‌ రావడంతో యూపీఓని ప్రభుత్వాస్పత్రిలో చేర్చి.. ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. అయితే సోమవారం రాత్రి.. తన బట్టలను తాడుగా మార్చి.. ఆస్పత్రి వార్డులోని కిటికిని బద్దలు కొట్టి పారిపోయాడు. అతడి వయస్సు 60 ఏళ్లని తెలుస్తోంది. అంతేకాదు.. నేపాల్‌ నుంచి వచ్చిన 17 మంది సభ్యుల్లో పారిపోయిన వ్యక్తి కూడా ఒకడని… శుక్రవారం బాఘ్‌పట్‌లో ప్రభుత్వాస్పత్రిలో చేరిన అతనికి.. ప్రస్తుతం ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు అతని కోసం సమీప గ్రామాల్లో గాలింపు చేపడుతున్నారు.