TS Covid 19 Cases: తెలంగాణలో పెరగుతున్న కరోనా వ్యాప్తి.. నిన్నతో పోల్చితే 45 కేసులు అధికం.. వైరస్‌తో ఇద్దరు మృతి
Telangana Covid 19 Cases: తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా, మరోసారి పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి.
Telangana Coronavirus Cases: తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా, మరోసారి పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 43,135 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 207 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్యశాఖ సోమవారం సాయంత్రం విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. అంతకుముందు రోజు 162 కరోనా కేసులే నమోదయ్యాయి. ఇక ఒక్కరోజు వ్యవధిలోనే కేసులు అధికంగా రికార్డు అయ్యాయి.
తాజాగా, నమోదైన 207 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్త కరోనా కేసుల సంఖ్య 6,66,753కు చేరింది. కాగా, గత 24 గంటల్లో కొత్తగా ఇద్దరు మరణించారు. ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3,923కు చేరుకుంది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. కాగా, మరో 1316 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.
ఇదిలావుంటే, గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 239 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,58,409కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4,421 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో స్వల్ప క్షీణత నమోదైంది. ఇక, ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా 2,65,43,381 నమూనాలను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇవాళ వివిధ జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి…
Read Also… హనీమూన్ సంస్కృతి ఎప్పుడు.. ఏ దేశంలో ప్రారంభమైందో తెలుసా.. హనీమూన్ వెనుక గల చరిత్ర ఎంటో తెలుసుకోండి…