- Telugu News Photo Gallery World photos Know the history and name story know why people go for honeymoon after wedding
హనీమూన్ సంస్కృతి ఎప్పుడు.. ఏ దేశంలో ప్రారంభమైందో తెలుసా.. హనీమూన్ వెనుక గల చరిత్ర ఎంటో తెలుసుకోండి…
హనీమూన్.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం. వివాహం తర్వాత వధువరులు తమకు నచ్చిన ప్రదేశాలకు ట్రిప్ ప్లాన్ చేసుకోవడమే. అయితే హనీమూన్ ఎప్పుడు, ఏ దేశంలో ప్రారంభమైంది.. ఎందుకు ప్రారంభించారో తెలుసుకుందామా.
Updated on: Oct 04, 2021 | 9:24 PM

పెళ్లికి ముందు అనేక రకాల ఆచారాలు ఉన్నాయి. అలాగే పెళ్లి తర్వాత ఉన్న ఆచారం హనీమూన్. పెళ్లి తర్వాత వధువరులు ట్రీప్ ప్లాన్ చేసుకుంటుంటారు. కేవలం నూతన వధువరులు మాత్రమే కాకుండా.. ఎవరైనా జంటగా వెళ్లోచ్చు.

హనీమూన్ వివిధ దేశాల్లో వివిధ రకాలుగా చెప్తుంటారు. కానీ నిజానికి ఈ పదాన్ని 18వ శతాబ్ధంలో ఫ్రెంచ్‌లో ఉపయోగించారు. ఆ తర్వాత 19వ శతాబ్ధం రెండవ త్రైమాసికంలో ఇది సర్వసాధారణమైంది. ప్రతి సంస్కృతిలో ఈ హనీమూన్ సంప్రదాయాన్ని వివాహం తర్వాత ప్రశాంతమైన సమయాన్ని గడిపడం అని పేర్కోన్నారు.

చరిత్రలో హనీమూన్ గురించి రకరకాల కథలు ఉన్నాయి. వాస్తవానికి హనీమూన్ అంటే.. స్త్రీని తన కుటుంబానికి దూరంగా ఉంచడం.. పూర్వం ఒక అబ్బాయి.. ఒక అమ్మాయిని ఇంట్లో నుంచి తీసుకెళ్లి దూరంగా వేరే ప్రాంతంలో నివసించారు. దీంతో అమ్మాయి కుటుంబసభ్యులు .. ఆమె కోసం వెతికి వెతికి చివరకు వెతకడం మానేసారు.

అలా వెళ్లిన వారు చాలా కాలం వరకు రహస్యంగా నివసించేవారట. అనంతరం వారికి పిల్లలు జన్మించిన తర్వాత.. తిరిగి తమ ప్రాంతాలకు చేరుకున్నారట. అయితే మారుతన్న కాలానికి అనుగుణంగా ఆ పద్ధతి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఈ పద్ధతి వివాహం తర్వాత నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వరుడు.. వధువు తన కుటుంబ సభ్యుల అనుమతితో తీసుకుని వెళ్తాడు.

యూరోప్‌లోని అనేక దేశాలలో వివాహం తర్వాత ఒక ఆచారంగా హనీమూన్ సంస్కృతి కొనసాగుతుంది. క్రమంగా వివాహం జరిగిన మొదటి నెలలోనే ఈ సంప్రదాయాన్ని నిర్వహిస్తున్నారు.





























