- Telugu News Photo Gallery Spiritual photos Sri Kurmanathaswamy temple: A Guide to the Unique Turtle Avatar Temple, Kashi of South India know the details
Unique Temple: మీకు తెలుసా.. కాశీ తర్వాత పితృకర్మలకు పవిత్ర క్షేత్రం..ఈ పుష్కరిణిలో అస్థికలు కల్పితే సాలగ్రామ శిలలుగా మారతాయట
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీ మహా విష్ణువు రకరకాల అవతారాలను దాల్చాడు. ఈ అవతారాల్లో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. శ్రీ మహా విష్ణు రెండోది కూర్మావతారం. ఈ అవతారంలో భక్తులతో పూజలను అందుకుంటున్న ఏకైక ఆలయం శ్రీ కూర్మ. ఈ ఆలయం అంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళంలో ఉంది. ఇలాంటి ఆలయం మన దేశంలోనే కాదు ప్రపంచంలో మరెక్కడా లేదు. బ్రహ్మ ప్రతిష్ఠించిన పంచలింగ క్షేత్రంగా ప్రసిద్దిగాంచిన ఈ ఆలయం ఎన్నో విశిష్టలను సొంతం చేసుకుంది. ఈ రోజు శ్రీ కూర్మ క్షేత్రం
Surya Kala | Edited By: Ravi Kiran
Updated on: Mar 19, 2025 | 4:26 PM

పితృ కార్యం అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది కాశీ. అయితే వారణాసితో సమానమైన ఫలాలను అందించే క్షేత్రం ఒకటి ఆంద్రప్రదేశ్ లో ఉంది. కాశికి వెళ్ళలేని వారు ఈ క్షేత్రానికి వెళ్లి పితృ కర్మలను నిర్వహిస్తారు. వారణాసి నుంచి గంగా దేవి ప్రతి మాఘ మాసం శుద్ధ చవితి రోజున ఈ క్షేత్రంలో ఉన్న శ్వేతపుష్కరిణిలో స్నానమాచరిస్తుందని నమ్మకం. అంతేకాదు తాము ఈ పుష్కరిణిలో విడిచిన పాపాలను గంగా దేవి ప్రక్షాళన చేస్తుందని విశ్వాసం. ఆ పవిత్ర క్షేత్రం శ్రీ కూర్మం.

శ్రీకాకుళం జిల్లాలోని గార మండలంలో ఉన్న ఈ ఆలయం బ్రహ్మ ప్రతిష్ఠించిన పంచలింగ క్షేత్రంగా ప్రసిద్ధి. ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో రెండు ధ్వజస్తంభాలున్నాయి. అంతేకాదు.. ఇక్కడ గర్భ గుడిలో కొలువైన కూర్మనాథ స్వామివారు పడమటి ముఖంగా ఉంటారు.

ఈ క్షేత్రంలోని పవిత్ర పుష్కరిణిలో గంగా దేవి స్నానం చేయడానికి వస్తుందని నమ్మకం. ఇక్కడ విశాలమైన ప్రాకారంతో పాటు కూర్మవతారానికి నిజరూపమైన తాబేళ్లు ఇక్కడ కనువిందు చేస్తాయి.

అత్యంత పవిత్రమైన పుష్కరిణి దగ్గర పితృ కర్మలను చేసి.. పితృదేవతల అస్థికలు కలిపితే.. అవి కొంతకాలానికి సాలగ్రామ శిలలుగా మారుతాయని స్థానికుల విశ్వాసం. అందుకనే కాశికి వెళ్ళలేని వారు తమ పితృదేవతల అస్థికలను కలిపేందుకు వస్తారు,

కూర్మ పురాణం ప్రకారం.. దేవదానవులు అమృతం కోసం క్షీర సాగరాన్ని మదించదానికి వాసుకిని తాడుగా మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకున్నారు. సముద్రంలో పర్వతం నిలవడానికి ఆధారం లేకపోవడంతో మునిగిపోతుంది. అప్పుడు దేవతలు శ్రీ మహా విష్ణువుని ప్రార్థించగా... విష్ణువు కూర్మావతారం దాల్చి.. తన మోపురం మీద మందర పర్వతాన్ని నిలిపాడు. ఆ కూర్మ రూపాన్ని బ్రహ్మదేవుడే స్వయంగా శ్రీ కూర్మంలో ప్రతిష్ఠించాడని స్థల పురాణం. ఈ క్షేత్ర ప్రస్తావన పద్మ పురాణంలోనూ, బ్రహ్మాండ పురాణంలోనూ కనిపిస్తుంది.

కూర్మనాథుడి ఆలయ నిర్మాణ విషయంలో భిన్న వాదనలు ఉన్నాయి. ఆలయ శాసనాల ఆధారంగా కృతయుగంలో నిర్మించారని ఓ నమ్మకం. అంతేకాదు ఈ ఆలయాన్ని రెండో శతాబ్దానికి ముందు నిర్మించారని ప్రాశస్త్యం. అయితే ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారు అనే విషయం ఇప్పటికీ స్పష్టంగా తెలియదు.

ఏడో శతాబ్దం నుంచి కూర్మనాథుడి ఆలయానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అలనాటి వివిధ రాజులు.. ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. కళింగ, ఆంధ్ర, చోళుల రాజవంశ పాలనలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు.

8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు, 11వ శతాబ్దంలో రామానుజాచార్యులు, 13వ శతాబ్దంలో మధ్వాచార్యుల శిష్యులైన శ్రీనరహరితీర్థులు సందర్శించినట్లు చరిత్రకారులు చెబుతారు. శ్రీరాముడి తనయులు లవకుశలు కూడా ఆలయాన్ని సందర్శించారని చెబుతుంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ రామానుజాచార్యులు, శ్రీ వరద రాజస్వామి, శ్రీ మధ్వాచార్యులు, శ్రీ కోదండరామస్వామి ఆలయాలు కూడా ఉన్నాయి.

ఆధ్యాత్మిక ప్రాధాన్యతో పాటు ఆకర్షించే శిల్పకళా సంపద అద్భుతమైన సౌందర్యం ఈ ఆలయం సొంతం. ఆలయ పైభాగం అష్టదళ పద్మాకారంలో ఉంటుంది. తూర్పు, దక్షిణ ద్వారాలపై అందమైన శిల్పాలు కనువిందు చేస్తాయి. అబ్బుపరిచే శిల్పాలు, కుడ్య చిత్రాలు ఇక్కడ ప్రత్యేకాకర్షణ. ఆలయంలో మొత్తం 108 రాతి స్తంభాలు ఉన్నాయి.. ఒక దానితో మరొకటి పోలిక ఉండక పోవడం విశేషం. జ్యేష్ఠ బహుళ ద్వాదశి రోజున స్వామివారి జయంతిని అత్యంత ఘనంగా చేస్తారు.





























