Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KKR vs RCB: తొలి మ్యాచ్‌లోనే ఆర్‌సీబీ బిగ్ షాక్ ఇవ్వనున్న ముగ్గురు.. హ్యాట్రిక్ ఓటమి పక్కా?

3 KKR Players May Threat For RCB: ఐపీఎల్ 2025 సమరానికి రంగం సిద్ధమైంది. అన్ని జట్లు తమ సన్నాహాలను కూడా పూర్తి చేశాయి. ఇక శనివారం నాడు జరిగే తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు రాయల్ చాలెంజర్స్ జట్టుతో తలపడేందుకు సిద్ధమైంది. అయితే, గతసారి లాగే కేకేఆర్ హ్యాట్రిక్ విజయం సాధించాలని కోరుకుంటోంది. ఆర్‌సీబీ మాత్రం తొలి విజయం సాధించాలని కోరుకుంటోంది.

KKR vs RCB: తొలి మ్యాచ్‌లోనే ఆర్‌సీబీ బిగ్ షాక్ ఇవ్వనున్న ముగ్గురు.. హ్యాట్రిక్ ఓటమి పక్కా?
Kkr Vs Rcb
Follow us
Venkata Chari

|

Updated on: Mar 19, 2025 | 5:42 PM

3 KKR Players May Threat For RCB: ఐపీఎల్ 2025లో మొదటి మ్యాచ్ ఈసారి చాలా ఉత్కంఠభరితంగా ఉంటుందని భావిస్తున్నారు. దీనికి కారణం ఈసారి మొదటి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ విరాట్ కోహ్లీ టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. రెండు జట్లలోనూ చాలా మంది గొప్ప ఆటగాళ్ళు ఉన్నారు. అందువల్ల ఒక ఉత్తేజకరమైన మ్యాచ్ చూడవచ్చు. ఈసారి RCBకి సమస్యలు సృష్టించగల కొంతమంది ఆటగాళ్లు KKRలో ఉన్నారు. దీంతో గత రికార్డ్‌ను బ్రేక్ చేయడం ఆర్‌సీబీకి కష్టమేనని తెలుస్తోంది. ఎందుకంటే, ఇంతకుముందు ఇరుజట్ల మధ్య జరిగిన 2 ఓపెనింగ్ మ్యాచ్‌ల్లో కేకేఆర్ జట్టే విజయం సాధించింది.

IPL 2025 మొదటి మ్యాచ్‌లో RCBకి భారీ ముప్పుగా నిరూపించగల ముగ్గురు KKR ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

3. క్వింటన్ డి కాక్..

దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ క్వింటన్ డి కాక్ ఈసారి KKRలో భాగమయ్యాడు. అతను జట్టు తరపున ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంది. క్వింటన్ డి కాక్ కు ఐపీఎల్‌లో చాలా అనుభవం ఉంది. అతను గతంలో RCB తరపున కూడా ఓపెనింగ్ చేశాడు. డి కాక్ ఒక అద్భుతమైన ఆటగాడు. ఒకసారి అతను క్రీజులో స్థిరపడితే, మ్యాచ్‌ను ప్రత్యర్థి జట్టు పట్టు నుంచి చాలా దూరం తీసుకెళ్లగలడు. ఇటువంటి పరిస్థితిలో అతను RCBకి పెద్ద ముప్పుగా మారగల ఆటగాడు.

ఇవి కూడా చదవండి

2. సునీల్ నరైన్..

సునీల్ నరైన్ గత కొన్ని సంవత్సరాలుగా KKR తరపున ఆడుతున్నాడు. గత సంవత్సరం జట్టును ఛాంపియన్‌గా చేయడంలో అతని సహకారం చాలా ముఖ్యమైనది. KKR తరపున సునీల్ నరైన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. పవర్‌ప్లేలో చాలా డేంజరస్ బ్యాటింగ్‌తో బౌలర్లపై సత్తా చాటుతుంటాడు. పవర్‌ప్లేలోనే నరైన్ మ్యాచ్‌ను చాలా దూరం తీసుకెళ్తాడు. దీనితో పాటు, అతను తన మిస్టరీ స్పిన్‌తో బ్యాట్స్‌మెన్‌కు కఠినమైన సవాలును కూడా విసురుతుంటాడు. ఇటువంటి పరిస్థితిలో ఈ మొదటి మ్యాచ్‌లో సునీల్ నరైన్ RCBకి చాలా ప్రమాదకరంగా మారే ఛాన్స్ ఉంది.

1. ఆండ్రీ రస్సెల్..

ఏ జట్టులోనైనా ఆండ్రీ రస్సెల్ లాంటి తుఫాన్ బ్యాట్స్‌మన్ ఉన్నా, ఆ జట్టు విజయావకాశాలు గణనీయంగా పెరుగుతాయి. రస్సెల్ తన అద్భుతమైన ఇన్నింగ్స్ ఆధారంగా చాలా మ్యాచ్‌ల్లో KKRను విజయాల వైపు నడిపించాడు. అతను ఐపీఎల్‌లో కూడా చాలాసార్లు ఆర్‌సీబీపై అద్భుతంగా రాణించాడు. తనంతట తానుగా జట్టును విజయపథంలో నడిపించే సత్తా ఉంది. ఈసారి కూడా అతను RCBకి పెద్ద ముప్పుగా మారగలడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌