AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni Video: ఐపీఎల్‌ ఆరంభానికి ముందు అన్ని టీమ్స్‌కి ధోని వార్నింగ్‌! వయసైందా? ఈ షాట్‌ చూసి మాట్లాడు!

ఐపీఎల్ 2025 సీజన్‌ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు, ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోని చివరి సీజన్ అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో. గాయం నుండి కోలుకున్న ధోని, తన ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకుని, ప్రాక్టీస్‌ సమయంలో హెలికాప్టర్ షాట్‌తో అలరించాడు. ఇది ధోని అభిమానులను ఉత్సాహపరిచింది. అతని ప్రదర్శన ఈ సీజన్‌లో ఎలా ఉంటుందో చూడటానికి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

MS Dhoni Video: ఐపీఎల్‌ ఆరంభానికి ముందు అన్ని టీమ్స్‌కి ధోని వార్నింగ్‌! వయసైందా? ఈ షాట్‌ చూసి మాట్లాడు!
Ms Dhoni
SN Pasha
|

Updated on: Mar 19, 2025 | 12:47 PM

Share

ఐపీఎల్‌ 2025 కోసం క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎందుకు చూస్తున్నారు. అలాగే దిగ్గజ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని ఆట చూసేందుకు కూడా చాలా మంది ఫ్యాన్స్‌ వెయిటింగ్‌. ఇదే ధోనికి చివరి ఐపీఎల్‌ అనే చర్చ నడుస్తున్న క్రమంలో ధోని బ్యాటింగ్‌ చూసి తీరాల్సిందే అనే ఒక వైబ్‌ అయితే ఉంది. తన అభిమానుల కోసమే ఐపీఎల్‌ ఆడుతున్న ధోని.. ఈ సీజన్‌ ఆరంభానికి ముందే అన్ని టీమ్స్‌కు ఒక స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. గత సీజన్‌లో గాయంతో ధోని.. ఎక్కువగా బ్యాటింగ్‌ చేయలేదు. లాస్ట్‌ రావడంతో ఒకటీ ఆరా షాట్లు ఆడటం తప్ప.. తన అభిమానులకు కనుల విందుగా ఒక పెద్ద ఇన్నింగ్స్‌ ఆడలేదు.

సో ఈ సారి కూడా ధోని పెద్దగా ఆడకపోవచ్చని ఇతర టీమ్స్‌ వాళ్లు భావిస్తూ ఉండొచ్చు. అలా అనుకోవడానికి అస్సలు వీలు లేదని, ఈ సారి ధోని ప్రతాపం ఏంటో చూస్తారంటూ.. సాంపిల్‌గా ఒక షాట్‌ వదిలాడు. అది చూస్తే.. వింటేజ్‌ ధోని గుర్తుకు వస్తాడు. ధోని ట్రేడ్‌ మార్క్‌ షాట్‌ అయిన హెలికాప్టర్‌ షాట్‌ను ధోని చాలా అవలీలగా ఆడుతూ కనిపించాడు. సీఎస్‌కే టీమ్ ప్రాక్టీస్‌ సందర్భంగా ధోని సూపర్‌ షాట్‌తో అదరగొట్టాడు. అది కూడా స్పీడ్‌ గన్‌ మతీష పతిరణ బౌలింగ్‌లో షార్ప్‌ యార్కర్‌ను సిక్సర్‌గా మలిచాడు. అది చూసి.. అక్కడున్న వాళ్లంతా షాక్‌ అయ్యారు.

అబ్బో.. అన్నకు వయసు అయిపోలేదురోయ్‌ అన్నట్లు రియాక్షన్స్‌ ఇచ్చారు. ఎంతైనా ధోని హెలికాప్టర్‌ షాట్‌ ఆడితే చూసేందుకు చాలా చూడముచ్చటగా ఉంటుందని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. కాగా, ఒక వేళ ధోనికి ఇదే చివరి ఐపీఎల్‌ సీజన్‌ అయితే మాత్రం కచ్చితంగా ఫ్యా్న్స్‌కు ఐఫీస్ట్‌ ఇచ్చే వెళ్తాడు ధోని. పైగా ఐపీఎల్‌ 2025 సీజన్‌ కోసం గత 8 నెలలుగా ధోని ప్రిపేర్‌ అవుతున్నాడు. లాంగ్‌ సీజన్‌ ఆడేందుకు తన బాడీని రెడీ చేశాడు. సో ప్రస్తుతానికైతే ఫుల్‌ ఫిట్‌గా ఉన్న ధోని.. ఈ సీజన్‌లో ఎలాంటి బ్యాటింగ్‌ చేస్తాడో అని అంతా ఎగ్జైటింగ్ గా ఉన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.