కొవిడ్‌తో మరణించిన కుటుంబాలకు రూ.50 వేలు చెల్లించాల్సిందే..! రాష్ట్రాలు ఎట్టి పరిస్థితుల్లో నిరాకరించొద్దు..

Covid-19 Deaths: కొవిడ్ -19 తో మరణించిన కుటుంబాలకు రూ.50,000 ఎక్స్‌గ్రేషియాను ఏ రాష్ట్రం తిరస్కరించవద్దని సుప్రీంకోర్టు తెలిపింది. జాతీయ విపత్తు నిర్వహణ

కొవిడ్‌తో మరణించిన కుటుంబాలకు రూ.50 వేలు చెల్లించాల్సిందే..! రాష్ట్రాలు ఎట్టి పరిస్థితుల్లో నిరాకరించొద్దు..
Covid 19

Covid-19 Deaths: కొవిడ్ -19 తో మరణించిన కుటుంబాలకు రూ.50,000 ఎక్స్‌గ్రేషియాను ఏ రాష్ట్రం తిరస్కరించవద్దని సుప్రీంకోర్టు తెలిపింది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కింద (NDMA) రూ.50,000 ఎక్స్‌గ్రేషియాను చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఎఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. మరణ ధృవీకరణ తేదీ నుంచి 30 రోజుల్లోగా రాష్ట్ర విపత్తు సహాయ నిధి నుంచి పరిహారం అందించాలని పేర్కొంది. అంతేకాదు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ పథకానికి విస్తృత ప్రచారం కల్పించాలని రాష్ట్రాలను ఆదేశించింది.

ఇందుకోసం బాధిత కుటుంబాలు.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే దరఖాస్తు ఫారం నింపి, అవసరమైన సర్టిఫికేట్స్ జత చేయాల్సి ఉంటుంది. వాటిని జిల్లా అధికారుల కమిటీ తనిఖీ చేస్తుంది. జిల్లా కమిటీలో కలెక్టర్‌, వైద్య-ఆరోగ్య అధికారి, వైద్య కళాశాల ప్రిన్సిపల్‌, మరో నిపుణుడు సభ్యులుగా ఉంటారు. దరఖాస్తులను పరిశీలించి.. ఈ కమిటీ చేసే సిఫార్సు మేరకు పరిహరం చెల్లించనున్నారు. కరోనా వైరస్ నివారణ చర్యల్లో పాల్గొన్ని ప్రాణాలు కోల్పోయిన వారిక కుటుంబాలకు కూడా ఈ పరిహారం వర్తిస్తుందని కేంద్రం తెలిపింది.

కేంద్ర ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం మరణ ధ్రువీకరణ పత్రాలు ఇస్తారు. భవిష్యత్తులో కరోనాతో మరణించినవారి కుటుంబాలకు కూడా ఈ పరిహారం వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే, కరోనా సోకడంతో ఆందోళన చెందిన కొందరు ఆత్మహత్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. కోవిడ్ పాజటివ్ రిపోర్ట్ వచ్చిన 30 రోజుల్లోపు ఆత్మహత్య చేసుకున్న రోగుల కుటుంబ సభ్యులు పరిహారం పొందడానికి అర్హులని స్పష్టం చేసింది. దీంతో కరోనా పాజటివ్‌గా తేలడంతో ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకూ కూడా రూ. 50వేల పరిహారం అందించనున్నట్లు కేంద్ర సర్కార్ వెల్లడించింది.

DC vs CSK, IPL 2021: ఉత్కంఠ మ్యాచ్‌లో చెన్నైపై ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం.. రాణించిన శిఖర్ ధావన్‌..

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu