ఎవర్నీ వదలట్లేదు.. ఉప ప్రధానిని కాటేసిన కరోనా మహమ్మారి..

కరోనా.. ఇప్పుడు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోన్న మహమ్మారి. మూడో ప్రపంచ యుద్ధం వస్తే.. శాంతి ఒప్పందాలతో యుద్ధాన్నైనా ఆపవచ్చునేమో కానీ.. కరోనాను మాత్రం నివారించలేని పరిస్థితులు తలెత్తుతున్నాయి. సామాన్యడి నుంచి మొదలుకొని.. అగ్రదేశాధినేతలను సైతం ఈ వైరస్ వణికిస్తోంది. తాజాగా.. స్పెయిన్ ఉప ప్రధాని కార్మెన్ కాల్వోకు.. కరోనా పాజిటివ్ వచ్చినట్లు స్పానిష్ ప్రభుత్వం బుధవారం రాత్రి ప్రకటించింది. కాల్వోకు బుధవారం కరోనా టెస్ట్‌లు చేయగా.. పాజిటివ్ వచ్చినట్లు తేలింది. దీంతో వైద్యులు ఆమెను ఐసోలేషన్ […]

ఎవర్నీ వదలట్లేదు.. ఉప ప్రధానిని కాటేసిన కరోనా మహమ్మారి..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 26, 2020 | 9:06 AM

కరోనా.. ఇప్పుడు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోన్న మహమ్మారి. మూడో ప్రపంచ యుద్ధం వస్తే.. శాంతి ఒప్పందాలతో యుద్ధాన్నైనా ఆపవచ్చునేమో కానీ.. కరోనాను మాత్రం నివారించలేని పరిస్థితులు తలెత్తుతున్నాయి. సామాన్యడి నుంచి మొదలుకొని.. అగ్రదేశాధినేతలను సైతం ఈ వైరస్ వణికిస్తోంది. తాజాగా.. స్పెయిన్ ఉప ప్రధాని కార్మెన్ కాల్వోకు.. కరోనా పాజిటివ్ వచ్చినట్లు స్పానిష్ ప్రభుత్వం బుధవారం రాత్రి ప్రకటించింది.

కాల్వోకు బుధవారం కరోనా టెస్ట్‌లు చేయగా.. పాజిటివ్ వచ్చినట్లు తేలింది. దీంతో వైద్యులు ఆమెను ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇటలీ తర్వాత స్పెయిన్ దేశంలోనే అత్యధికంగా 50వేలమందికి పైగా కరోనా మహమ్మారి సోకింది. ఇప్పటికే స్పెయిన్‌లో కరోనా కాటుకు మూడువేల మందకిపైగా ప్రాణాలుకో్ల్పోయారు.

కాగా.. ప్రపంచ వ్యాప్తంగా 18వేల మందికి పైగా కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మరో నాలుగున్నర లక్షల మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పలుదేశాలు కరోనా వ్యాప్తిచెందకుండా.. లాక్‌డౌన్ ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.