Coronavirus: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రంలో కరోనా కల్లోలం
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రంలో కరోనా కల్లోలం రేపుతోంది. దీంతో అంతరిక్ష కేంద్రంలో తాత్కాలికంగా పనులు నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. షార్ కేంద్రంలో కరోనా సోకి ఇప్పటి వరకు 13 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో సైంటిస్టులు, టెక్నికల్ సిబ్బంది ఉన్నారు. దీంతో ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. కరోనా సెంకండ్ వేవ్ ఏపీలో విజృంభిస్తోంది. నిత్యం వేల కేసులు వెలుగు చూస్తున్నాయి. అయితే ప్రజల రద్దీకి దూరంగా ఉండే షార్ కేంద్రంలో […]
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రంలో కరోనా కల్లోలం రేపుతోంది. దీంతో అంతరిక్ష కేంద్రంలో తాత్కాలికంగా పనులు నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. షార్ కేంద్రంలో కరోనా సోకి ఇప్పటి వరకు 13 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో సైంటిస్టులు, టెక్నికల్ సిబ్బంది ఉన్నారు. దీంతో ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది.
కరోనా సెంకండ్ వేవ్ ఏపీలో విజృంభిస్తోంది. నిత్యం వేల కేసులు వెలుగు చూస్తున్నాయి. అయితే ప్రజల రద్దీకి దూరంగా ఉండే షార్ కేంద్రంలో కరోనా విలయతాండవం చేయడం భయాందోళన రేకెత్తిస్తోంది. ఇప్పటికే 50 శాతం సిబ్బందితో శ్రీహరికోట షార్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. వరుస మరణాలు సంభవిస్తుండటంతో విధులకు వెళ్లేందుకు సిబ్బంది వెనకడుగు వేస్తున్నారు. శ్రీహరికోట లో ప్రత్యేక కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేయాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు.
షార్‌లో 2020 లో కరోనా ఎఫెక్ట్ తో 80 శాతం ప్రయోగాలు వాయిదా పడ్డాయి. సెకండ్ వేవ్ రూపంలో మహమ్మారి విరుచుపడుతుండటంతో ఇస్రో అధికారులు మరింత ఆందోళన చెందుతున్నారు. షార్ కేందరంలో నిత్యం పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా కట్టడికి ఇస్రో ఇప్పటికే చర్యలు చేపట్టింది. సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని సూచించింది. శుభకార్యాలు, వివాహాల్లో పాల్గొనడంపై ఆంక్షలు విధించింది. అనుమతి లేకుండా ఎవరైనా శుభకార్యాలకు హాజరైతే చర్యలు తప్పవని హెచ్చరించింది. ప్రతి క్వార్టర్స్ లో కమిటీలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. తప్పని సరిగా పాల్గొనాల్సి వస్తే అనుమతి, తగిన జాగ్రత్తలు తప్పని సరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Also Read: కోవిడ్ పై పోరులో మీకు సహకరిస్తాం, మీ ఆర్దర్లను అడ్డుకోకుండా చూస్తాం, సోను సూద్ కు చైనా రాయబారి హామీ