‘ఆక్సిజన్ కేటాయించండి. లేదా కోర్టు ధిక్కారాన్ని ఎదుర్కోండి’ కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు చురక

ఢిల్లీ  నగరానికి ఎట్టి పరిస్థితుల్లోనూ 490 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ని కేటాయించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. లేదా కోర్టు ధిక్కారాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

'ఆక్సిజన్ కేటాయించండి. లేదా కోర్టు ధిక్కారాన్ని ఎదుర్కోండి' కేంద్రానికి  ఢిల్లీ హైకోర్టు చురక
Supply Oxygen Immediately
Follow us

| Edited By: Phani CH

Updated on: May 01, 2021 | 6:26 PM

ఢిల్లీ  నగరానికి ఎట్టి పరిస్థితుల్లోనూ 490 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ని కేటాయించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. లేదా కోర్టు ధిక్కారాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. మీరు ఇన్ని టన్నుల ఆక్సిజన్ ఇస్తామని ఏప్రిల్  20 నే హామీ ఇచ్చారు.. ఆ హామీని నెరవేర్చండి అని న్యాయమూర్తులు విపిన్ సంఘి, రేఖా పల్లితో కూడిన బెంచ్ సూచించింది. ఇప్పటికే తలపై ఎన్నో నీళ్లు పోసినంత పనైంది అని బెంచ్ వ్యాఖ్యానించింది. అంటే ఇప్పటికే జాప్యం జరిగిందని పరోక్షంగా బెంచ్ పేర్కొంది. ఈ ఉత్తర్వులను సోమవారం వరకు, లేదా కనీసం అరగంట వరకైనా వాయిదా వేయాలన్న కేంద్రం తరఫు లాయర్ అభ్యర్థనను బెంచ్  తిరస్కరించింది.జరిగింది చాలని, ఆక్సిజన్ ట్యాంకర్లను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మీదేనని న్యాయమూర్తులు అన్నారు. ఈ రోజు మీరు ఆక్సిజన్ ని సప్లయ్ చేయకపోతే సోమవారం మీ సంజాయిషీని ఆలకిస్తాం అని పేర్కొన్నారు. ఢిల్లీలో ప్రజలు మరణిస్తున్నంత సేపు మేం కళ్ళు మూసుకుని కూర్చోవాలా అని బెంచ్ తీవ్రంగా ప్రశ్నించింది. ఆక్సిజన్ కొరత అంశం సుప్రీంకోర్టు విచారణలోఉందని, ఆ కోర్టు నుంచి ఉత్తర్వులు శనివారం వస్తాయని కేంద్రం పేర్కొన్నప్పుడు హైకోర్టు ఇలా స్పందించింది.

ఆక్సిజన్ సరఫరా లేక ఢిల్లీ  లోని బాత్రా ఆసుపత్రిలో ఒక డాక్టర్ .సహా 8 మంది రోగులు మృతి చెందిన  విషయాన్ని కోర్టు  తీవ్రంగా పరిగణించింది. ఆ డాక్టర్ ని గ్యాస్ట్రో డిపార్ట్ మెంటుకు చెందిన ఆర్,కె. హింతానీగా గుర్తించారు. ఇంతటి దారుణ పరిస్థితులు ఉన్నా కేంద్రం చురుకుగా స్పందించడం లేదని కోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇటీవల సుప్రీంకోర్టు కూడా దేశంలో ఆక్సిజన్, ఆసుపత్రుల్లో బెడ్స్ కొరతపై కేంద్రాన్ని నిలదీసింది. ముఖ్యంగా ఢిల్లీలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక ఇతర నగరాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది.

మరిన్ని ఇక్కడ చూడండి: టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన అమరరాజ బ్యాటరీస్ కంపెనీకి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ షాక్‌

Baby elephant: ఒంటరిగా ఆడుకుందాం.. కరోనాను తరిమి కొడదాం అన్నట్టు అడవిలో ఓ చిన్నారి ఏనుగు ఆట..నెట్టింట వైరల్!