టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన అమరరాజ బ్యాటరీస్ కంపెనీకి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ షాక్‌

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన అమరరాజ బ్యాటరీ కంపెనీకి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ షాక్‌ ఇచ్చింది. పొల్యూషన్ నిబంధనలు పాటించని..

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన అమరరాజ బ్యాటరీస్ కంపెనీకి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ షాక్‌
Amara Raja Batteries
Follow us
Ram Naramaneni

|

Updated on: May 01, 2021 | 6:15 PM

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన అమరరాజ బ్యాటరీ కంపెనీకి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ షాక్‌ ఇచ్చింది. పొల్యూషన్ నిబంధనలు పాటించని కారణంగా అమరరాజ బ్యాటరీ కంపెనీలు మూసేయ్యాలని ఆదేశాలు జారీ చేసింది. స‌ద‌రు కంపెనీ బ్యాటరీల నుంచి వచ్చే లెడ్ వల్ల తీవ్రమైన జల కాలుష్యం జరుగుతొందని పీసీబీ తన నోటీసులో పేర్కొంది.

చిత్తూరులోని బంగారుపాళ్యం, తిరుపతి కరకంబాడీ రెండు యూనిట్లు మూసేయ్యాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆదేశించింది. ఈ రెండు ప్లాంట్లలో వచ్చే లెడ్ వల్ల భవిష్యతులో ఏలూరులో వింతజబ్బు వచ్చి పడిపోయినట్టుగా జనాలు ఇబ్బందులు పడతారని పీసీబీ హెచ్చరించింది. ప్రస్తుతం ఈ రెండు ప్లాంట్లలో పన్నెండు వేలకు పైగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఏడాదికి పదివేల కోట్ల టర్నోవర్ తో అమరరాజ కంపెనీ వ్యాపారం నిర్వహిస్తోంది.

పీసీబీ నోటీసులతో అమరరాజ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అత్యవసరంగా సమావేశమయ్యారు. గల్లా జయదేవ్ కు చెందిన అమరరాజా బ్యాటరీ కంపెనీకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జారీ చేసిన‌ క్లోజర్ నోటీస్ లో సంచలన విషయాలు వెల్లడించింది. విపరీతమైన కాలుష్యం కారణంగా అమరరాజాకు చెందిన బంగారుపాళ్యం, తిరుపతిలోని కరకంబాడి యూనిట్లను తక్షణం మూసివేయాలని పొల్యూషన్ బోర్డు నోటీసులు జారీ చేసింది.

తక్షణం అమరరాజా కంపెనీలకు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ఎపీఎస్పీడీసీఎల్ కు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సూచించింది. ఇంకా కంపెనీని నడిపితే అండర్ సెక్షన్ 41ప్రకారం ప్రాసిక్యూట్ చేస్తామని యాజమాన్యానికి హెచ్చరించింది. అమరరాజా బ్యాటరీ కంపెనీల వల్ల నీటి కాలుష్యంతో పాటు గాలి కాలుష్యం విపరీతంగా జరుగుతోందని పీసీబీ పేర్కొంది. 1974 వాటర్ప్ ప్రివెన్షన్ కంట్రోల్ అమెండమెంట్ యాక్ట్, 1981 ఎయిర్ ప్రివెన్షన్ కంట్రోల్ అమెండమెంట్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసులో పీసీబీ పేర్కొంది.

Also Read: గ్యాస్ సిలిండర్ల కొత్త ధరలు విడుదల..! గత నెలతో పోల్చితే తగ్గుదల.. ఏడాదికి 12 సిలిండర్లకు మాత్రమే..!

వీడి కక్కుర్తి పాడుకానూ..ఈ మహానుభావుడు ఏటీఎంలో ఏమి దొంగిలించాడో తెలిస్తే మీరు కచ్చితంగా అబ్బా..ఛీ అంటారు!

ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. ఇదే జరిగితే డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి ఔట్
ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. ఇదే జరిగితే డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి ఔట్
ఇంటి నుంచి దోమల్ని తరిమికొట్టాలంటే.. అరటి పండుతో ఇలా చేస్తే చాలు!
ఇంటి నుంచి దోమల్ని తరిమికొట్టాలంటే.. అరటి పండుతో ఇలా చేస్తే చాలు!
డిగ్రీ అర్హతతో కెనరా బ్యాంకులో ఉద్యోగాలు.. ఎన్ని పోస్టులున్నాయంటే
డిగ్రీ అర్హతతో కెనరా బ్యాంకులో ఉద్యోగాలు.. ఎన్ని పోస్టులున్నాయంటే
అనామికకు చెక్ పెట్టిన కావ్య.. తెలియకుండానే ఊబిలో చిక్కుకుంటోంది..
అనామికకు చెక్ పెట్టిన కావ్య.. తెలియకుండానే ఊబిలో చిక్కుకుంటోంది..
శుభ్‌మన్ గిల్‌పై పక్షపాతం? బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు
శుభ్‌మన్ గిల్‌పై పక్షపాతం? బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు
హైకోర్టులో కేటీఆర్‌కు దక్కని ఊరట.. ఏసీబీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి.?
హైకోర్టులో కేటీఆర్‌కు దక్కని ఊరట.. ఏసీబీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి.?
11 ఫోర్లు, 3 సిక్సర్లతో ఊచకోత.. ఛేజింగ్‌లో సరికొత్త సినిమా
11 ఫోర్లు, 3 సిక్సర్లతో ఊచకోత.. ఛేజింగ్‌లో సరికొత్త సినిమా
ఆరోగ్యానికి ఏంతో మేలు చేసే అరటి పువ్వు.. వారానికోసారి తినండి చాలు
ఆరోగ్యానికి ఏంతో మేలు చేసే అరటి పువ్వు.. వారానికోసారి తినండి చాలు
వేగంగా వ్యాపిస్తున్న HMPV వైరస్‌.. కొత్తగా మరో ఇద్దరికి పాజిటివ్!
వేగంగా వ్యాపిస్తున్న HMPV వైరస్‌.. కొత్తగా మరో ఇద్దరికి పాజిటివ్!
జీవిత పోరాటం మధ్య క్రికెట్ సందేశం: సామ్ స్ఫూర్తి గాథ
జీవిత పోరాటం మధ్య క్రికెట్ సందేశం: సామ్ స్ఫూర్తి గాథ