Baby elephant: ఒంటరిగా ఆడుకుందాం.. కరోనాను తరిమి కొడదాం అన్నట్టు అడవిలో ఓ చిన్నారి ఏనుగు ఆట..నెట్టింట వైరల్!
అడవిలో జంతువుల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని అందరికీ అనిపిస్తూ ఉంటుంది. దానిని మనకు చూపించడానికి ఎందరో కష్టపడుతూ ఉంటారు. క్రూర మృగాల పోరాటాలు.. చిన్న జంతువుల బ్రతుకు ఆరాటం..
Baby elephant: అడవిలో జంతువుల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని అందరికీ అనిపిస్తూ ఉంటుంది. దానిని మనకు చూపించడానికి ఎందరో కష్టపడుతూ ఉంటారు. క్రూర మృగాల పోరాటాలు.. చిన్న జంతువుల బ్రతుకు ఆరాటం.. సరీసృపాల బుస బుసలు.. స్వేచ్చగా ఎగురుతూ జీవించే పక్షులు.. ఇలా సృష్టిలోని ప్రతి జీవిని వారు పరిశీలించి.. వీడియోలు తీసి అందులో మనకోసం కొన్నిటిని పంచుతుంటారు. వాటిలో కూడా చాలా రకాల వీడియోలుంటాయి. కానీ, చిన్నారి జంతువుల అల్లరి చేష్టలూ.. చిలిపి పనులూ మనల్ని ఆకర్షించినంతగా మరేదీ ఆకర్షించదు.
ఇదిగో మీకు మంచి ఉల్లాసాన్ని అందించే వీడియో చూపిస్తున్నాం. చూసి ఎంజాయ్ చేయండి. ఎందుకు ఈ వీడియో ఉల్లాసాన్నిస్తుంది అంటున్నామంటే, ఒక చిన్నారి ఏనుగు.. అడవిలో ఒక్కతే తన ఆట ఆడుకుంటోంది. ఆ ఆట ఎలా ఉందంటే.. మనింట్లో చంటి పాపాయి ఉంటె.. ఆ పాపాయికి ఒక బంతిలాంటి వస్తువు దొరికితే ప్రపంచాన్ని మర్చిపోయి ఎలా ఆడుకుంటుందో అలా. అలా మన పాపాయిని చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది. మరి ఈ గున్నఏనుగును చూసినా అంతే ముచ్చటేస్తుంది. అందుకే ఈ వీడియో వైరల్ అయింది.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్‌కు చెందిన సుశాంత నందా ఒక చిన్న క్లిప్. ఒక అడవిలో ఎండుగడ్డి స్టాక్‌తో స్వయంగా ఆడుకుంటున్న బుల్లి ఎనుగుది సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ చిన్నారి ఏనుగు ప్రతి క్షణం ఆనందించడంతో పాటు.. సమీపంలో ఏ ఇతర జంతువు కనిపించలేదు ఆ వీడియోలో. ఈ వీడియోకు సుశాంత నందా ఇచ్చిన క్యాప్షన్ ఏమిటో తెలుసా? ”“దూరంగా ఉండండి, ఒంటరిగా ఆడుకోండి. కరోనా గొలుసును విచ్ఛిన్నం చేయండి.” అదిరింది కదూ. ఆ వీడియోలానే.. ఇప్పటి పరిస్థితుల గురించి చెబుతున్నట్టు..
ఈ వీడియోకు బోలెడు లైకులు.. మరిన్ని కామెంట్స్ వస్తున్నాయి. మీరూ ఈ వీడియో ఇక్కడ చూసేయండి..
Stay aloof, Play aloud & alone? (Break the chain of CORONA) pic.twitter.com/jikOqxqQR8
— Susanta Nanda IFS (@susantananda3) April 29, 2021