ఆసుపత్రిలో అడ్మిషన్ కోసం వేచి చూస్తూ కారులోనే కన్ను మూసిన మహిళా కోవిడ్ రోగి
కోవిడ్ పాజిటివ్ కి గురైన 35 ఏళ్ళమహిళ తన కారులోనే మరణించింది. గ్రేటర్ నోయిడాలోని ఆసుపత్రిలో అడ్మిషన్ కోసం వచ్చిన ఈమె ఆ సౌకర్యం లేక తన వాహనంలోనే కన్ను మూసింది.
కోవిడ్ పాజిటివ్ కి గురైన 35 ఏళ్ళమహిళ తన కారులోనే మరణించింది. గ్రేటర్ నోయిడాలోని ఆసుపత్రిలో అడ్మిషన్ కోసం వచ్చిన ఈమె ఆ సౌకర్యం లేక తన వాహనంలోనే కన్ను మూసింది. ఆమె మృత దేహం ఈ కారులో మూడు గంటలకు పైగా అలాగే ఉంది. నోయిడాలోని ఓ సంస్థలో ఈమె ఇంజనీరుగా పని చేస్తోందని, పేరు జాగృతి గుప్తా అని తెలిసింది. ఈమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారని వెల్లడైంది. జాగృతి వెంట వచ్చిన సహాయకుడు ఈమె అడ్మిషన్ కోసం ఆసుపత్రి అధికారులను ప్రాధేయ పడినా బెడ్స్ లేవని చెప్పడంతో ఆయన నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. చివరకు శ్వాస తీసుకోలేక జాగృతి తన కారులోనే మరణించింది. తీరా డాక్టర్ కారు వద్దకు వచ్చేసరికి అప్పటికే ఆమె ప్రాణాలు పోయాయని ప్రకటించాడు. పైగా ఆమె డెడ్ బాడీని మార్చ్యురీ కి కూడా తరలించాలన్న ఉద్దేశం అతనికి లేకపోయిందని ఆమె సహాయకుడు వాపోయాడు, మూడు గంటల తరువాత ఆమె బంధువులు వచ్చి అంత్య క్రియల కోసం తరలించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: కోవిడ్ రోగులకు నిరంతరం సేవలు చేస్తూ ఢిల్లీలో యువ డాక్టర్ ఆత్మహత్య , షాక్ తిన్న ఐఎంఏ
850 రూపాయలకే హెల్త్ ఇన్సూరెన్స్..! 5 లక్షల వరకు ఉచిత చికిత్స.. కరోనాకు కూడా ఫ్రీ ట్రీట్‌మెంట్..