కోవిడ్ రోగులకు నిరంతరం సేవలు చేస్తూ ఢిల్లీలో యువ డాక్టర్ ఆత్మహత్య , షాక్ తిన్న ఐఎంఏ

ఢిల్లీలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో కోవిడ్  వార్డు లోని రోగులకు నిరంతరం సేవలు చేస్తూ   డిప్రెషన్ కి గురై  వివేక్ రాయ్ అనే యువ డాక్టర్ ఆత్మహత్య  చేసుకున్నారు. .

కోవిడ్ రోగులకు నిరంతరం సేవలు చేస్తూ ఢిల్లీలో యువ డాక్టర్  ఆత్మహత్య , షాక్ తిన్న ఐఎంఏ
Doctor Working In Delhi Hospital Covid Ward Dies By Suicide
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: May 01, 2021 | 9:51 PM

ఢిల్లీలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో కోవిడ్  వార్డు లోని రోగులకు నిరంతరం సేవలు చేస్తూ   డిప్రెషన్ కి గురై  వివేక్ రాయ్ అనే యువ డాక్టర్ ఆత్మహత్య  చేసుకున్నారు. .యూపీ లోని గోరఖ్ పూర్ కు చెందిన ఈయన ఈ పాండమిక్ లో వందలాది పేషంట్లకు చికిత్స చేస్తూ వచ్చారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ ) మాజీ చీఫ్ డాక్టర్ రవి వాంఖేడ్ కర్ తెలిపారు. ఈయన ఎంతో బ్రిలియంట్ డాక్టర్ అని, విషమ స్థితిలో ఉన్న ఏడెనిమిది మంది రోగులకు రోజూ సేవలు అందిస్తూ వచ్చారని ఆయన తెలిపారు. తన కళ్ళ ముందే రోగులు మరణిస్తుంటే వివేక్ రాయ్ చూడలేక డిప్రెషన్ కి గురయ్యాడని ఆయన చెప్పారు. వారి బాధలు, ఎమోషన్స్ చూసి ఇలా జీవించడం కన్నా మరణించడమే మేలని ఈ డాక్టర్ భావించి సూసైడ్ చేసుకున్నట్టు కనిపిస్తోందని రవి వాంఖేడ్ కర్  ట్వీట్ చేశారు.  వివేక్ రాయ్ కి భార్య ఉన్నారని, ఆమె రెండు  నెలల గర్భవతి అని తెలుస్తోంది.

ఒక యువ డాక్టర్ ఇలా బలవన్మరణం చెందారంటే అది వ్యవస్థ చేసిన హత్యేనని రవి పేర్కొన్నారు.  ఈ సిస్టమే నిరాశా వాదాన్ని సృష్టించిందని ఆయన అన్నారు. బ్యాడ్ సైన్స్, బ్యాడ్ పాలిటిక్స్, బ్యాడ్ గవర్నెన్స్ అని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రుల్లో ప్రస్తుతం పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని స్థానిక వైద్య సిబ్బంది కొందరు తెలిపారు. రోజుకు 10 గంటల పాటు తాము  పని చేస్తున్నామని, కానీ రోగుల ప్రాణాలు  రక్షించలేకపోతున్నామని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా ఢిల్లీ హాస్పిటల్స్ లో ఆక్సిజన్ సౌకర్యం లేక  పలువురు రోగులు మృతి చెందుతున్నారని వారు పేర్కొన్నారు.

మరిన్ని ఇక్కడ చూడనుండి: 850 రూపాయలకే హెల్త్ ఇన్సూరెన్స్..! 5 లక్షల వరకు ఉచిత చికిత్స.. కరోనాకు కూడా ఫ్రీ ట్రీట్‌మెంట్..

Adar Poonawalla: కోవిడ్ టీకాల కోసం పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయి.. సీరం ఇనిస్టిట్యూట్ సీఈవో పూనవల్లా

అనామికకు చెక్ పెట్టిన కావ్య.. తెలియకుండానే ఊబిలో చిక్కుకుంటోంది..
అనామికకు చెక్ పెట్టిన కావ్య.. తెలియకుండానే ఊబిలో చిక్కుకుంటోంది..
శుభ్‌మన్ గిల్‌పై పక్షపాతం? బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు
శుభ్‌మన్ గిల్‌పై పక్షపాతం? బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు
హైకోర్టులో కేటీఆర్‌కు దక్కని ఊరట.. ఏసీబీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి.?
హైకోర్టులో కేటీఆర్‌కు దక్కని ఊరట.. ఏసీబీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి.?
11 ఫోర్లు, 3 సిక్సర్లతో ఊచకోత.. ఛేజింగ్‌లో సరికొత్త సినిమా
11 ఫోర్లు, 3 సిక్సర్లతో ఊచకోత.. ఛేజింగ్‌లో సరికొత్త సినిమా
ఆరోగ్యానికి ఏంతో మేలు చేసే అరటి పువ్వు.. వారానికోసారి తినండి చాలు
ఆరోగ్యానికి ఏంతో మేలు చేసే అరటి పువ్వు.. వారానికోసారి తినండి చాలు
వేగంగా వ్యాపిస్తున్న HMPV వైరస్‌.. కొత్తగా మరో ఇద్దరికి పాజిటివ్!
వేగంగా వ్యాపిస్తున్న HMPV వైరస్‌.. కొత్తగా మరో ఇద్దరికి పాజిటివ్!
జీవిత పోరాటం మధ్య క్రికెట్ సందేశం: సామ్ స్ఫూర్తి గాథ
జీవిత పోరాటం మధ్య క్రికెట్ సందేశం: సామ్ స్ఫూర్తి గాథ
136 ఏళ్లలో తొలిసారి.. ఫాలో ఆన్‌లో ప్రపంచ రికార్డ్ స్కోర్..
136 ఏళ్లలో తొలిసారి.. ఫాలో ఆన్‌లో ప్రపంచ రికార్డ్ స్కోర్..
శ్రీతేజ్‏ను పరామర్శించిన అల్లు అర్జున్, దిల్ రాజ్..
శ్రీతేజ్‏ను పరామర్శించిన అల్లు అర్జున్, దిల్ రాజ్..
నేడే ఢిల్లీ ఎన్నికల నగారా.. మధ్యాహ్నం 2 గంటలకు EC ప్రకటన
నేడే ఢిల్లీ ఎన్నికల నగారా.. మధ్యాహ్నం 2 గంటలకు EC ప్రకటన