Putin: కరోనా మహమ్మారిపై పోరు… ప్రపంచ దేశాలకు గుడ్ న్యూస్ చెప్పిన రష్యా.. తీపికబురు ఏంటంటే?
Sputnik V Vaccine - Russia: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారిపై పోరు కొనసాగుతున్న వేళ ప్రపంచ దేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ గుడ్ న్యూస్ చెప్పారు. రష్యా శాస్త్రవేత్తలు స్పుత్నిక్ వీ కొవిడ్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం తెలిసిందే. ప్రపంచంలో అభివృద్ధి అయిన తొలి కొవిడ్ వ్యాక్సిన్‌గా దీనికి గుర్తింపు ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారిపై పోరు కొనసాగుతున్న వేళ ప్రపంచ దేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ గుడ్ న్యూస్ చెప్పారు. రష్యా శాస్త్రవేత్తలు స్పుత్నిక్ వీ కొవిడ్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం తెలిసిందే. ప్రపంచంలో అభివృద్ధి అయిన తొలి కొవిడ్ వ్యాక్సిన్‌గా దీనికి గుర్తింపు ఉంది. పలు ప్రపంచ దేశాలకు ఈ వ్యాక్సిన్లను రష్యా సరఫరా చేస్తోంది. ఇటు భారత్‌లో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ తయారీకి పలు కంపెనీలు సన్నద్ధమవుతున్నాయి. ఇటీవల సీరమ్ ఇన్‌స్టిట్యూట్ కూడా భారత్‌లో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసేందుకు డీసీజీఐ అనుమతి పొందింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ టెన్నాలజీ బదిలీకి సంబంధించి ప్రపంచ దేశాలకు పుతిన్ తీపి కబురు చెప్పారు. తమ వ్యాక్సిన్ టెక్నాలజీని ఇతర దేశాలకు బదిలీ చేసేందుకు రష్యా సిద్ధమని ఆయన ప్రకటించారు. వ్యాక్సిన్ టెక్నాలజీని పంచుకునేందుకు సిద్ధమైన ఏకైకక దేశం రష్యాయేనని ఆయన స్పష్టంచేశారు. తద్వారా విదేశాల్లో కూడా స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ఉత్పత్తిని విస్తృతం చేయనున్నట్లు చెప్పారు. పీటీఐ, అసోసియేటెడ్ ప్రెస్, రాయిటర్స్ సహా పలు అంతర్జాతీయ వార్తా సంస్థల సీనియర్ ఎడిటర్లతో శనివారం ఆన్‌లైన్‌లో మాట్లాడిన పుతిన్…ఈ వ్యాఖ్యలు చేశారు.
అదే సమయంలో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ సమర్థతపై వస్తున్న విమర్శలను తోసిపుచ్చిన పుతిన్..97.6 శాతం సమర్థతతో వ్యాక్సిన్ పనిచేస్తున్నట్లు పుతిన్ చెప్పారు. అంతర్జాతీయ వైద్య నిపుణులు కూడా తమ వ్యాక్సిన్ సామర్థ్యం పట్ల సంతృప్తి వ్యక్తంచేసినట్లు గుర్తు చేశారు. వాణిజ్య కారణాలతోనే తమ వ్యాక్సిన్‌పై విమర్శలు చేస్తున్నారని…తాము మానవీయ మార్గాన్ని ఎంచుకున్నట్లు పేర్కొన్నారు. తమ వ్యాక్సిన్‌ను ఇప్పటి వరకు 66 దేశాలకు విక్రయించినట్లు వెల్లడించారు. వ్యాక్సిన్ కంపెనీల మధ్య మితిమీరిన పోటీ, వాణిజ్య ప్రయోజనాల కారణంగానే యూరప్‌లో తమ వ్యాక్సిన్ ఇంకా రిజిస్టర్ కాలేదని వ్యాఖ్యానించారు.
కొవిడ్ సంక్షోభానికి చైనానే కారణమంటూ అమెరికా సహా పలు దేశాలు ఆరోపిస్తుండటంపై అడిగిన ప్రశ్నకు పుతిన్ సమాధానమిస్తూ…ఈ అంశంపై చాలాసార్లు తన వైఖరిని స్పష్టంచేసినట్లు గుర్తు చేశారు. దీనిపై ఇప్పుడు కొత్తగా మాట్లాడేందుకు ఏమీ లేదన్నారు. సంక్షోభాన్ని రాజకీయం చేయడం సరికాదన్నారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు రాజకీయ ప్రేరేపిత అడ్డుగోడలను తొలగించుకోవాలని పుతిన్ సూచించారు.
టెక్నాలజీ బదిలీతో లాభాలేంటి?
వ్యాక్సిన్ టెక్నాలజీ బదిలీతో ఇతర దేశాలకు చాలా మేలు జరుగుతుంది. తమ దేశాల్లోనే స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. తద్వారా ప్రజలకు వీలైనంత త్వరగా వ్యాక్సిన్లు అందే అవకాశముంటుంది. వీటికి అయ్యే వ్యయం కూడా తక్కువగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
ఇది మామూలు ఎలుక కాదండోయ్.. మనషులు 4 నాలుగు రోజుల్లో చేసే పని 20 నిమిషాల్లోనే చేసేస్తుందట..!
Facebook alerts Delhi Police: ఆ యూజర్ చనిపోతున్నాడు.. అమెరికా నుంచి ఫేస్‌బుక్ అలెర్ట్.. ఆ తర్వాత..