Covid 19 Vaccine: 12ఏళ్ల లోపు చిన్నారులకు కొవిడ్ వ్యాక్సిన్‌పై కేంద్ర ప్రభుత్వ ప్యానెల్ సభ్యుడు కీలక వ్యాఖ్యలు!

కోవిడ్ -19 నియంత్రణలో భాగంగా పిల్లలకు టీకాలు వేయాలా వద్దా అన్న అంశం మరోసారి తెరపైకి వచ్చింది. చిన్నారులు, పిల్లలకు వ్యాక్సిన్‌ అవసరం లేదని టీకాపై నరేంద్ర మోడీ ప్రభుత్వ ప్యానెల్ సభ్యుడు ఒకరు జాతీయ మీడయాకు ఇచ్చిన ఇంర్వ్యూలో చెప్పారు.

Covid 19 Vaccine: 12ఏళ్ల లోపు చిన్నారులకు కొవిడ్ వ్యాక్సిన్‌పై కేంద్ర ప్రభుత్వ ప్యానెల్ సభ్యుడు కీలక వ్యాఖ్యలు!
Child Vaccine
Follow us

|

Updated on: Dec 21, 2021 | 3:28 PM

Covid 19 Vaccination for Children: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. భారత్‌లో కూడా ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కోవిడ్ -19 నియంత్రణలో భాగంగా పిల్లలకు టీకాలు వేయాలా వద్దా అన్న అంశం మరోసారి తెరపైకి వచ్చింది. చిన్నారులు, పిల్లలకు వ్యాక్సిన్‌ అవసరం లేదని టీకాపై నరేంద్ర మోడీ ప్రభుత్వ ప్యానెల్ సభ్యుడు ఒకరు జాతీయ మీడయాకు ఇచ్చిన ఇంర్వ్యూలో చెప్పారు. “పిల్లలు బాగానే ఉన్నారు, మేము ఇప్పుడు పిల్లలకు టీకాలు వేయకూడదని నిర్ణయించాము” అని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ ఇన్ ఇండియా (ఎన్‌టిఎజిఐ) సభ్యుడు డాక్టర్ జయప్రకాష్ ములియిల్ తెలిపారు.

‘‘భారత్‌లో 12ఏళ్ల లోపు చిన్నారుల్లో కొవిడ్ మరణాలు నమోదు కాలేదు. ఈ వయసు వారిలో కొందరికి కరోనా సోకినప్పటికీ ఆ తీవ్రత తక్కువగానే ఉంది. కోవిడ్ -19 కారణంగా 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో భారతదేశంలో ఒక్క మరణాన్ని కూడా చూడలేదు. ముఖ్యంగా క్యాన్సర్, లుకేమియా, ఇతర వ్యాధుల కారణంగా పిల్లలలో మరణాలను నమోదు అయ్యాయి. అయితే, కరోనా వైరస్ పాజిటివ్ కారణంగా మరణాలు కారణమని చెప్పలేము” అని ఆయన పేర్కొన్నారు. వెల్లూర్‌లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ అయిన ప్రముఖ ఎపిడెమియాలజిస్టు దేశంలోనే ఒకరిగా పేరొందిన ములియిల్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే, ఈ డేటాను విశ్లేషించిన తర్వాత చిన్నారులకు ఇప్పుడే కరోనా టీకాలు ఇవ్వడం అత్యవసరం కాదని అనిపిస్తోంది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా చెప్పాం’’ అని ఎన్‌టీఏజీఐ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే దీనిపై తమ ప్యానెల్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

చిన్నారులకు టీకా పంపిణీపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ విషయంలో తాము తొందరపడకూడదని నిర్ణయించుకున్నట్లు ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ సైతం వెల్లడించారు. నిపుణుల సూచన మేరకే ముందుకు వెళ్లనున్నట్లు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో చిన్నారులకు టీకా వేస్తున్నప్పటికీ.. భారీ స్థాయిలో మాత్రం ఎక్కడా జరగడం లేదని కేంద్రమంత్రి క్లారిటీ ఇచ్చారు. మరోవైపు స్వదేశీ సంస్థ జైడస్‌ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్‌ డి టీకాను 12ఏళ్ల పైబడిన వారికి ఇచ్చేందుకు కేంద్రం అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. అయితే దీని పంపిణీపై కేంద్రం ఇంకా ప్రకటన చేయలేదు. ఈ టీకాలను తొలుత 7 రాష్ట్రాల్లో మాత్రమే అందించేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

మరోవైపు, దేశంలో ఒమిక్రాన్ కేసులు, కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. ఒమిక్రాన్ వేరియంట్‌పై కేంద్ర ప్రభుత్వం నిఘా ఉంచిందని తెలిపారు. రోజు నిపుణులతో కలిసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టుగా చెప్పారు. దేశంలో ఇప్పటి వరకు 161 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వలో ఆరోగ్య కార్యకర్తల కృషితో కోవిడ్ వ్యాక్సినేషన్ దేశంలో విజయవంతంగా కొనసాగుతుందని చెప్పారు. ఇప్పటివరకు దేశంలో అర్హులైన వారిలో 88 శాతం మందికి కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్‌ తీసుకున్నారని మన్సుఖ్ మాండవియా తెలిపారు. అర్హులైన వారిలో 58 శాతం మందికి రెండో డోస్‌లు ఇచ్చినట్టుగా చెప్పారు. దేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తగిన పరిమాణంలో కోవిడ్ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద 17 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

Read Also…. Piyush Goyal: రా రైస్‌ ఎంత ఇచ్చినా కేంద్రం కొనుగోలు చేస్తుంది.. స్పష్టం చేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్