మార్చి 31 వరకు న్యూస్ పేపర్స్ సరఫరా నిలిపివేస్తున్నాం..!

కరోనా వైరస్ వ్యాప్తి ప్రబలుతుండటంతో.. మల్కాజ్ గిరి మాకర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు దిన పత్రికలను నిషేధిస్తున్నట్లు అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు పత్రికల ఏజెంట్లకు, యజమానులకు న్యూస్ పేపర్ సరఫరా నిలిపివేయాలని కోరుతూ.. అసోసియేషన్ తరఫున ఓ వినతిపత్రాన్ని కూడా అందజేశారు. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా.. అరికట్టేందుకు తాము కూడా ఈ పోరాటంలో భాగస్వాములమవుతామని.. కరోనా ప్రభావం తగ్గగానే.. తిరిగి సప్లై చేపడతామని.. ఇందుకు పాఠకులు కూడా […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:34 pm, Tue, 24 March 20
మార్చి 31 వరకు న్యూస్ పేపర్స్ సరఫరా నిలిపివేస్తున్నాం..!

కరోనా వైరస్ వ్యాప్తి ప్రబలుతుండటంతో.. మల్కాజ్ గిరి మాకర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు దిన పత్రికలను నిషేధిస్తున్నట్లు అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు పత్రికల ఏజెంట్లకు, యజమానులకు న్యూస్ పేపర్ సరఫరా నిలిపివేయాలని కోరుతూ.. అసోసియేషన్ తరఫున ఓ వినతిపత్రాన్ని కూడా అందజేశారు. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా.. అరికట్టేందుకు తాము కూడా ఈ పోరాటంలో భాగస్వాములమవుతామని.. కరోనా ప్రభావం తగ్గగానే.. తిరిగి సప్లై చేపడతామని.. ఇందుకు పాఠకులు కూడా సహకరించాలని హాకర్స్ అసోసియేషన్ కోరింది.