AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముస్లిం ఇచ్చాడని వద్దన్నాడు.. జైలు పాలయ్యాడు..

డెలివరీ బాయ్ ముస్లిం కావడంతో కస్టమర్ సరుకులు తీసుకోవడానికి నిరాకరించాడు. మీ మతస్తుల నుంచి సరుకులు తీసుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశాడు. దీనితో డెలివరీ బాయ్ మనస్తాపానికి గురయ్యి తతంగం మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది.

ముస్లిం ఇచ్చాడని వద్దన్నాడు.. జైలు పాలయ్యాడు..
Ravi Kiran
|

Updated on: Apr 24, 2020 | 10:30 AM

Share

ఫలానా కులం వారిని, లేదా మతం వారిని సోకలన్న పట్టింపులు కరోనా వైరస్‌కు లేవని.. ఈ మహమ్మారి అందరికీ సోకుతుంది.. చంపేస్తుంది. ఈ మాట స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఒక మతస్థుల ద్వారానే కరోనా వ్యాప్తి చెందిందని దుష్ప్రచారం జరుగుతుండటం.. దాన్ని కొంతమంది ప్రజలు నమ్మేస్తూ వింత వింతగా ప్రవర్తిస్తున్నారు.

ముంబైలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ప్రజలు ఇంటి నుంచి బయటికి రాకుండా ఉండేలా.. నిత్యావసర వస్తువులను డోర్ డెలివరీ చేసేందుకు అధికారులు అనుమతించారు. దీనితో పలు ఆన్లైన్ సంస్థలు హోం డెలివరీ సేవలు అందించడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే ఓ కస్టమర్ ఇంటికి డెలివరీ బాయ్ నిత్యావసరాలను తీసుకొచ్చి ఇచ్చాడు. అయితే అక్కడ అతడికి ఊహించని పరిణామం ఎదురవ్వడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

డెలివరీ బాయ్ ముస్లిం కావడంతో కస్టమర్ సరుకులు తీసుకోవడానికి నిరాకరించాడు. మీ మతస్తుల నుంచి సరుకులు తీసుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశాడు. దీనితో డెలివరీ బాయ్ మనస్తాపానికి గురయ్యి తతంగం మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. తాను తీసుకోవాల్సిన రక్షణ చర్యలన్నీ తీసుకున్నానని.. చేతికి గ్లౌజులు, ముఖానికి మాస్క్ ధరించానని.. అయినా కూడా ముస్లింల దగ్గర నుంచి తాము సరుకులు తీసుకోమంటూ గొడవ చేశారని డెలివరీ బాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనితో సదరు కస్టమర్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇవి చదవండి:

మిస్టరీ డెత్స్: కరోనా వేళ.. 50 కాకులు, మూడు కుక్కలు మృతి..

భారత్ క్రికెటర్లు సెంచరీలు కోసం.. పాకిస్తాన్ ప్లేయర్స్ దేశం కోసం ఆడతారు..

గాంధీ ఆసుపత్రి కంటే జైలు బెటర్.. అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు.

రంజాన్ కోసం.. ఏపీలో సడలింపులు ఇవే.!

సిప్‌లో రూ.3000 పెట్టుబడి పెడితే 10 ఏళ్లలో ఎంత సంపాదించవచ్చు!
సిప్‌లో రూ.3000 పెట్టుబడి పెడితే 10 ఏళ్లలో ఎంత సంపాదించవచ్చు!
జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం..! నేడే ఏపీ కేబినేట్ సమావేశం..
జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం..! నేడే ఏపీ కేబినేట్ సమావేశం..
ఇంకా రెండు రోజులే ఉన్నాయి..! పని పూర్తి చేయండి
ఇంకా రెండు రోజులే ఉన్నాయి..! పని పూర్తి చేయండి
గంభీర్ సర్జికల్ స్ట్రైక్ తో ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..?
గంభీర్ సర్జికల్ స్ట్రైక్ తో ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..?
పదో తరగతి అర్హతతో BSFలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో BSFలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు..
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు..
మీ క్రెడిట్‌ కార్డును వాడుకోమని మీ ఫ్రెండ్‌కు ఇస్తున్నారా?
మీ క్రెడిట్‌ కార్డును వాడుకోమని మీ ఫ్రెండ్‌కు ఇస్తున్నారా?
మీ గోళ్లలో ఈ మార్పులు కనిపిస్తే.. అస్సల లైట్‌ తీసుకోవద్దు
మీ గోళ్లలో ఈ మార్పులు కనిపిస్తే.. అస్సల లైట్‌ తీసుకోవద్దు
రైతులకు కేంద్ర ప్రభుత్వం న్యూ ఇయర్‌ గిఫ్ట్‌!
రైతులకు కేంద్ర ప్రభుత్వం న్యూ ఇయర్‌ గిఫ్ట్‌!
ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ లో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం!
ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ లో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం!