రంజాన్ కోసం.. ఏపీలో సడలింపులు ఇవే.!

ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. ఈ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం రంజాన్‌పై సడలింపులు చేసింది. దీనిపై ఏపీ వక్ఫ్‌బోర్డు స్పందించింది.

రంజాన్ కోసం.. ఏపీలో సడలింపులు ఇవే.!
Follow us

|

Updated on: Apr 24, 2020 | 9:57 AM

ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. ఈ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం రంజాన్‌పై సడలింపులు చేసింది. దీనిపై ఏపీ వక్ఫ్‌బోర్డు స్పందించింది. సామాజిక దూరాన్ని తప్పనిసరి చేస్తూ ఇఫ్తార్ సమయంలో పండ్లు, డ్రై ఫ్రూట్స్ అమ్మకాలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని ఏపీ వక్ఫ్‌బోర్డు వెల్లడించింది. క్వారంటైన్‌లో ఉన్న ముస్లింలకు సహరి, ఇఫ్తార్ సమయాల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని ప్రభుత్వమే అందించనుందని.. అంతేకాక ఇమామ్‌, మౌజాన్‌లకు ఐదు పూటలా నమాజ్‌లు చదివే వెసులుబాటును కూడా కల్పించిందని బోర్డు తెలిపింది.

అటు మసీదు నుంచి ఇంటికి మధ్య రాకపోకలకు అనుమతులు దొరకగా.. ఉదయం 3 నుంచి 4.30 మధ్య, అలాగే సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు దాతలకు అనుమతి కల్పించింది. కాగా, కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపధ్యంలో ముస్లింలు గుంపులుగా ఉండకుండా ఇళ్లలోనే రంజాన్ ప్రార్ధనలు చేసుకోవాలని ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ ఇండియా కోరిన సంగతి తెలిసిందే.

ఇవి చదవండి:

మిస్టరీ డెత్స్: కరోనా వేళ.. 50 కాకులు, మూడు కుక్కలు మృతి..

భారత్ క్రికెటర్లు సెంచరీలు కోసం.. పాకిస్తాన్ ప్లేయర్స్ దేశం కోసం ఆడతారు..

గాంధీ ఆసుపత్రి కంటే జైలు బెటర్.. అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు.