Malware Alert: ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. ఈ రెండు యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి..

ఆండ్రాయిడ్ వినియోగదారులకు కీలకమైన హెచ్చరిక ఇది. మీ ఫోన్ పై హ్యాకర్‌లకు పూర్తి నియంత్రణను అందించగల కొత్త మాల్వేర్ కొన్ని యాప్స్ ద్వారా మీ ఫోన్లలోకి జొరపడింది.  ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ బృందం తాజా భద్రతా హెచ్చరికగా జారీ చేసింది. ఈ మాల్వేర్ పేరు డర్టీ స్ట్రీమ్. ఇది చాలా ప్రమాదకరమైనదని మైక్రోసాఫ్ట్ బృందం ప్రకటించింది.

Malware Alert: ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. ఈ రెండు యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి..
Phone Malware
Follow us

|

Updated on: May 08, 2024 | 6:21 AM

పెరుగుతున్న సాంకేతికత మనిషికి ఎంత సాంత్వన చేకూర్చుతుందో.. అదే స్థాయిలో భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది. సెక్యూరిటీ పరంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. సైబర్ దాడులు ఆగడం లేదు. ఏదో ఒక రకంగా నేరగాళ్లు వ్యక్తుల సోషల్ మీడియా అకౌంట్లు, బ్యాంకు ఖాతాలను కొల్లగొడుతున్నారు. ఇప్పుడు మరో మాల్వేర్ ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులను బెంబేలెత్తిస్తోంది. ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఈ మాల్వేర్ గురించి ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ ఈ మాల్వేర్ ఏంటి? దాని వల్ల కలిగే నష్టం ఏమిటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం..

మైక్రోసాఫ్ట్ టీం హెచ్చరిక..

ఆండ్రాయిడ్ వినియోగదారులకు కీలకమైన హెచ్చరిక ఇది. మీ ఫోన్ పై హ్యాకర్‌లకు పూర్తి నియంత్రణను అందించగల కొత్త మాల్వేర్ కొన్ని యాప్స్ ద్వారా మీ ఫోన్లలోకి జొరపడింది.  ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ బృందం తాజా భద్రతా హెచ్చరికగా జారీ చేసింది. ఈ మాల్వేర్ పేరు డర్టీ స్ట్రీమ్. ఇది చాలా ప్రమాదకరమైనదని మైక్రోసాఫ్ట్ బృందం ప్రకటించింది. ఇది ఆండ్రాయిడ్ డివైజ్లోకి చొరబడి ఫోన్ మొత్తాన్ని హ్యాక్ చేస్తుంది. ఫోన్లోని ఒక యాప్ మరొక యాప్ తో మాట్లాడుకోడానికి అనుమతిస్తుంది. ఆండ్రాయిడ్ యాప్లలో దీనిని కంటెంట్ ప్రొవైడర్ అని అంటారు. దీని ద్వారా మీ పరికరంపై మొత్తం నియంత్రణను హ్యాకర్ కు అందిస్తుంది. వాస్తవానికి ఆండ్రాయిడ్ కంటెట్ ప్రోవైడర్ సిస్టమ్ అనేది నిర్ధిష్ట భద్రతా ప్రమాణాలను కలిగి ఉంటుంది. ఇది యాప్ లను దుర్వినియోగం కానివ్వవు. అయినప్పటికీ కొత్త మాల్వేర్ దీనిని అధిగమిస్తుందని తెలుస్తోంది. అలాగే ఆయా యాప్స్ లోని వ్యక్తిగత డేటాను చోరీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పుడు ఇదే బిలియన్ల కొద్దీ వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది.

ఈ యాప్స్ ద్వారా..

ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్న పలు యాప్స్ లో ఈ మాల్వేర్ చొరబడినట్లు మైక్రోసాఫ్ట్ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాక దీనిని ఇప్పటికే 4 బిలియన్ల ఇన్ స్టాల్స్ ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పింది. ఆ యాప్స్ ఏంటంటే.. జియోమీ ఫైల్ మేనేజర్ ఇది ఒక బిలియన్ కన్నా ఎక్కువ ఇన్ స్టాల్స్ ను కలిగి ఉంది. అలాగే డబ్ల్యూపీఎస్ ఆఫీస్, ఇది కూడా 500 మిలియన్ డౌన్ లోడ్లను కలిగి ఉంది. అయితే శుభవార్త ఏంటంటే ఈ రెండు యాప్స్ తాజా అప్ డేట్లతో భద్రతను అందించింది. అయినప్పటికీ ఈ యాప్స్ మీ ఫోన్లో ఉంటే వెంటనే తొలగించాలని నిపుణులు సిఫార్లు చేస్తున్నారు.

ఇలా జాగ్రత్తగా ఉండాలి..

ఆండ్రాయిడ్ మాల్వేర్ ముప్పు పొంచి ఉంది. ఈ దాడులకు గురికాకుండా ఉండాలంటే మీరు ప్లే స్టోర్ ద్వారా మాత్రమే యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడమే ఏకైక మార్గం. థర్డ్ పార్టీ యాప్స్ అస్సలు డౌన్ లోడ్ చేయొద్దు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..