- Telugu News Photo Gallery Technology photos Amazon offering huge discount on oneplus 12, Check here for more details
OnePlus 12: రూ. 65వేల ఫోన్‌ను రూ. 17,500కే సొంతం చేసుకునే ఛాన్స్.. ఎలాగంటే
వన్‌ప్లస్ బ్రాండ్‌కు మార్కెట్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్ ఫోన్స్‌కు పెట్టింది పేరైనా వన్‌ప్లస్ ఇటీవల వన్‌ప్లస్ 12 పేరుతో ఓ ఫోన్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రీమియం సెగ్మెంట్‌లో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లను అందించారు. అయితే తాజాగా ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది..
Updated on: May 19, 2024 | 10:54 AM

రూ. 65వేల ఫోన్‌ను రూ. 17,500కే సొంతం చేసుకునే ఛాన్స్.. ఎలాగంటే వన్‌ప్లస్ 12 స్మార్ట్ ఫోన్‌పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ లభిస్తోంది. రూ. 65 వేల స్మార్ట్ ఫోన్‌ను ఏకంగా రూ. 17,500కి చేసుకునే అవకాశం కల్పించారు. ఇంతకీ ఈ డిస్కౌంట్‌ను ఎలా పొందాలి.? ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Oneplus 12 Priceవన్‌ప్లస్ 12, 12 జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 64,999 కాగా.. అమెజాన్‌పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 3249 డిస్కౌంట్‌ను పొందొచ్చు. అలాగే అమెజాన్ ప్రైమ్ మెంబర్స్‌కు 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 61,750కి సొంతం చేసుకోవచ్చు.

ఇక ఆఫర్స్ ఇక్కడితోనే ముగియలేదు. మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా కూడా డిస్కౌంట్ పొందొచ్చు. మీ ఫోన్ కండిషన్ బట్టి గరిష్టంగా రూ. 44,250 వరకు తగ్గింపు ధరకు పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌ను రూ. 17,500కే సొంతం చేసుకోవచ్చు.

ఇక వన్‌ప్లస్ 12స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.82 ఇంచెస్‌తో కూడిన క్యూహెచ్‌డీ+ ఎల్‌టీపీఓ ప్రో ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను అందించారు. 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఈ ఫోన్ సొంతం. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ను అందించారు. ఇందులో 64 ఎంపీ రెయిర్ కెమెరాను, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌ను అందించారు. 5400 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. 80 వాట్స్ సూపర్‌వూక్ వైర్డ్ ఛార్జింగ్‌కు, 50 వాట్స్ ఎయిర్‌వూక్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.




