కృత్రిమ వర్షాలు ఎలా కురుస్తాయో తెలుసా?

May 19, 2024

TV9 Telugu

TV9 Telugu

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌! ఏడు రాజ్యాల కూటమి. పేరుకే ఎడారి. వర్షం లేని లోటును కనక వర్షం తీరుస్తున్నది అక్కడ. ఇసుకతిన్నెల రంగును మరిపించే బంగారం కోట్ల సంపదను సృష్టిస్తుంది

TV9 Telugu

అయితే అరబ్‌ ఎమిరేట్స్‌లో వాతావరణం చాలా పొడిగా, వేడిగా ఉంటుంది. పగలు వెర్రెక్కించే ఎండ, రాత్రిళ్లు వణికించే చలి.. ఇలాంటి చోట వర్షపు జాడ కానరాదు. జనజీవనానికి ఉప్పు తొలగించిన సముద్రపు నీరే ఆధారం

TV9 Telugu

వాతావరణాన్ని చల్లబరచడానికి కృత్రిమ వర్షాలు కురిపిస్తుంది అక్కడి ప్రభుత్వం. అలాంటిది ఈ ఏడాది ఏప్రిల్‌ 15న అక్కడ ఏకంగా 255 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై 75 ఏండ్ల రికార్డులు బద్దలు కొట్టింది

TV9 Telugu

ఒక్కరాత్రిలో ఇంత వర్షం కురవడంతో వరదలు సంభవించి అరబ్‌ దేశాలు అల్లకల్లోలం అయ్యాయి. దీంతో ఈ కల్లోలానికి కారణం కృత్రిమ వర్షమేనా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి

TV9 Telugu

నిజానికి.. నీటి బిందువులతో మబ్బు భారమైనప్పుడే, అందులోని నీరు నేల మీదకు జారతాయి. అందుకు మబ్బులలో సాంద్రతను పెంచాలి అంటే దూరదూరంగా ఉన్న నీటి బిందువులు దగ్గర కావాలి. అలా చేసి కృత్రిమ వర్షం కురిపించోచ్చు

TV9 Telugu

1946లో మొదటిసారిగా డ్రై ఐస్‌ ఉపయోగించి కృత్రిమ వర్షాన్ని కురిపించారు. మబ్బుల్లోని నీటి బిందువులను ఘనీభవింపచేయడానికి సిల్వర్‌ అయోడైడ్‌, పొటాషియం అయోడైడ్‌, ప్రొపేన్‌, డ్రై ఐస్‌ లాంటి పదార్థాలను వాడతారు

TV9 Telugu

ఉప్పులాంటి కొన్ని పదార్థాలు చుట్టూ ఉన్న తేమను పీల్చుకునే శక్తిని కలిగి ఉంటాయి. వీటిని హైగ్రోస్కోపిక్‌ పదార్థాలు అంటారు. మబ్బుల్లోని బిందువులు దగ్గరకు వచ్చేందుకు ఇవి సాయపడతాయి

TV9 Telugu

మేఘాలలోని నీరుగార్చేందుకు (క్లౌడ్‌ సీడింగ్‌) అనుకూలమైన రసాయనాన్ని విమానాల ద్వారా కింద నుంచి మేఘాల దిశగా వాటిని విసిరి కృత్రిమ వర్షం కురిపిస్తారు. ఇలా దుబాయ్‌లో 2010 నుంచే కృత్రిమ వర్షాలను కురిపిస్తున్నారు

TV9 Telugu

అయితే తాజాగా దుబాయ్‌లో వచ్చిన వర్షాలకు క్లౌడ్‌ సీడింగ్‌కు ఎలాంటి సంబంధం లేదని అక్కడి పరిశోధకులు కొట్టిపారేస్తున్నారు. మహాఅయితే 10 శాతం పెరుగుతుంది.. అంతేగాని కృత్రిమ వర్ష ప్రయత్నాలతో వరదలు రావడం అసాధ్యం అంటున్నారు