28,200 ఫోన్లు బ్లాక్ చేయాలని కేంద్ర ఆదేశం..!

TV9 Telugu

18 May 2024

రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ మోసాలను అరికట్టేందుకు 28,200 మొబైల్స్‌ను బ్లాక్ చేయాలని టెలికాం ఆపరేటర్లను టెలికమ్యూనికేషన్స్ శాఖ ఆదేశించింది.

ఈ ఫోన్లతో అనుసంధానమైన 2 లక్షల సిమ్ కార్డులను రీ వెరిఫై చేయాలని టెలికాం ఆపరేటర్లను కేంద్ర సర్కార్ సూచించింది.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DoT), హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రాష్ట్ర పోలీసుతో కలిసి ఈ పని చేస్తోంది.

టెలికాం వనరులను సైబర్ నేరాలు దుర్వినియోగం చేయకుండా ఆపాలనుకుంటున్న కేంద్రం మార్చి నెలలో డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్ (డిఐపి) పెట్టింది.

సైబర్ మోసాల నెట్‌వర్క్‌ను విచ్ఛిన్నం చేయాలి. డిజిటల్ ప్రపంచంలోని ప్రమాదాల నుండి ప్రజలను రక్షించడమే DIP లక్ష్యం.

సైబర్ ఫ్రాడ్‌లో 28,200 మొబైల్ యూనిట్లు దుర్వినియోగం అయినట్లు వెల్లడించిన హోం మంత్రిత్వ శాఖ, రాష్ట్ర పోలీసులు.

ఈ హ్యాండ్‌సెట్‌లలో 20 లక్షల నంబర్‌లను ఉపయోగించినట్లు విశ్లేషించిన DoT. వీటిని బ్లాక్ చేయాలని భారతదేశం అంతటా టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను కోరిన DoT.

సైబర్ మోసాలను అరికట్టేందుకు 20 లక్షల మొబైల్ కనెక్షన్లను వెంటనే రీవెరిఫై చేయాలని ఆదేశించిన కేంద్ర సర్కార్.