భారత్ క్రికెటర్లు సెంచరీలు కోసం.. పాకిస్తాన్ ప్లేయర్స్ దేశం కోసం ఆడతారు..

భారత ప్లేయర్లు ఎప్పుడూ కూడా జట్టులో చోటు సంపాదించుకోవడం కోసమే ఆడేవారని..పాకిస్థాన్ మాజీ కెప్టెన్, చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్ ఉల్ హాక్ భారత్ క్రికెటర్లపై సంచలన వ్యాఖ్యలు చేశాడు

భారత్ క్రికెటర్లు సెంచరీలు కోసం.. పాకిస్తాన్ ప్లేయర్స్ దేశం కోసం ఆడతారు..
Follow us

|

Updated on: Apr 24, 2020 | 8:15 AM

పాకిస్థాన్ మాజీ కెప్టెన్, చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్ ఉల్ హాక్ భారత్ క్రికెటర్లపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను ఆడే రోజుల్లో భారత ప్లేయర్లు ఎప్పుడూ కూడా జట్టులో చోటు సంపాదించుకోవడం కోసమే ఆడేవారని.. జట్టు కోసం ఆడిన దాఖలాలు లేవని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల ఆతడు తోటి ప్లేయర్ రమీజ్ రాజా యుట్యూబ్ ఛానల్ టాక్ షోలో ఈ కామెంట్స్ చేశాడు.

ఇండియన్ ప్లేయర్స్ తమ స్వలాభం కోసం, సొంత రికార్డులే లక్ష్యంగా బ్యాటింగ్ చేసేవారు. కానీ పాకిస్తానీ క్రికెటర్లు జట్టు ప్రయోజనాల కోసమే ఆడేవారని.. జట్టు గెలుపే ధ్యేయంగా పాకిస్తానీలు శ్రమించేవారని ఇంజమామ్ అన్నాడు.

ఒక సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేసినవారికే మరో సిరీస్‌లో చోటు దక్కుతుంది. ఇది అప్పటి భారత్ జట్టులో వస్తున్న పద్దతి. అందుకే ప్లేయర్స్ అందరూ కూడా జట్టు కోసం కాకుండా సెంచరీల కోసమే ఆడేవారు. పేపర్ మీద పులులుగా కనిపించే ఇండియన్ బ్యాటింగ్ లైనప్.. ఆన్ ఫీల్డ్‌కి వచ్చేసరికి మొత్తం మారిపోతుంది. వారంతా కూడా తమ వ్యక్తిగత ప్రదర్శనలకు ప్రాముఖ్యత ఇచ్చి.. జట్టు ఓడిపోతున్నా కూడా పట్టించుకునే వారు కాదని ఇంజమామ్ ఆరోపించాడు.

ఇక నాటి భారత్ టీమ్ మాదిరిగానే ఇప్పటి పాకిస్తాన్ జట్టు తయారైందని.. ప్లేస్‌ల కోసం కాకుండా జట్టు పటిష్టం కోసం ఆడాలని.. భయపడుతూ ఆడొద్దని ఇంజమామ్ హితవు పలికాడు. కాగా అతడు భారత్ ప్లేయర్స్‌పై చేసిన వ్యాఖ్యలకు మన సీనియర్లు ఎలాంటి సమాధానం ఇస్తారో వేచి చూడాలి.

ఇవి చదవండి:

మిస్టరీ డెత్స్: కరోనా వేళ.. 50 కాకులు, మూడు కుక్కలు మృతి..

నేటి నుంచి సున్నా వడ్డీ పధకం.. వివరాలు ఇవే..

Latest Articles