హాకీ భారతదేశ జాతీయ క్రీడ కాదా.?

TV9 Telugu

02 May 2024

భారతదేశ జాతీయ క్రీడ ఏంటని అడిగితే ఎవరైనా వెంటనే చెప్పే సమాధానం హాకీ. అయితే ఇది తప్పు అని అంటే మీరు నమ్ముతారా.

అవునండి హాకీ మన జాతీయ క్రింద కాదు. ఈ విషయాన్ని గతంలో ఓ సారి RTI వెల్లడించింది. మరి జాతీయ క్రీడ ఏంటి అనుకొంటున్నారా.?

ఉత్తర మహారాష్ట్రలోని ధులే జిల్లాకు చెందిన ఓ పాఠశాల ఉపాధ్యాయుడు ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది.

మహారాష్ట్ర లోని వి కె పాటిల్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో టీచర్ గా ఉన్న మయూరేష్ అగర్వాల్ ను హాకీని దేశ జాతీయ క్రీడగా ఎప్పుడు ప్రకటించారని విద్యార్థులు అడిగారు.

ఈ నేపథ్యంలో తాను ఈ ప్రశ్నను సమాధానం కోసం RTIకి లేఖ రాశారు. దీనికి జనవరి 15, 2020న సమాధానం వచ్చింది.

"ప్రభుత్వం ఏ క్రీడను జాతీయ క్రీడగా ప్రకటించలేదు, ఎందుకంటే అన్ని ప్రముఖ క్రీడా విభాగాలను ప్రోత్సహించడం ప్రభుత్వ లక్ష్యం" అని మంత్రిత్వ శాఖ  పేర్కొంది.

RTI ఇచ్చిన ఈ సమాధానం ప్రకారం భారతదేశానికి అస్సలు ఎలాంటి జాతీయ క్రీడ లేదని 4 ఏళ్ల క్రితమే వెల్లడైంది.

ఈ విషయం చాలామందికి తెలియక ఇప్పటికి దేశ జాతీయ క్రీడ హాకీ అనుకొంటున్నారు. పాఠశాలల్లో కూడా ఇది బోధిస్తున్నారు.