Watch: కడపలో తొలిసారి అందాల పోటీలు.. యువతకు రెక్కలు తొడిగిన క్రౌన్ లెగసీ మహోత్సవం
న్ ఆఫ్ రాయలసీమ-2026 పేరుతో కడపలో తొలిసారి ఘనంగా ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్ టైటిల్ పోటీ నిర్వహించారు. యువత కలలకు రెక్కలు తొడిగిన క్రౌన్ లెగసీ మహోత్సవం. రాయలసీమలో ఫ్యాషన్, వ్యక్తిత్వ వికాసం, ప్రతిభా ప్రదర్శనలకు కొత్త దిశానిర్దేశం చేస్తూ క్రౌన్ ఆఫ్ రాయలసీమ–2026 కార్యక్రమం..

కడప, జూన్ 1: రాయలసీమ లో మహిళల ప్రతిభకు కొత్త వేదికగా క్రౌన్ ఆఫ్ రాయలసీమ-2026 పేరుతో కడపలో తొలిసారి ఘనంగా ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్ టైటిల్ పోటీ నిర్వహించారు. క్రౌన్ లెగసీ మహోత్సవం యువత కలలకు రెక్కలు తొడిగింది. రాయలసీమలో ఫ్యాషన్, వ్యక్తిత్వ వికాసం, ప్రతిభా ప్రదర్శనలకు కొత్త దిశానిర్దేశం చేస్తూ క్రౌన్ ఆఫ్ రాయలసీమ–2026 కార్యక్రమం కడప నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. రాయలసీమలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఫ్యాషన్ టైటిల్ పోటీగా గుర్తింపు పొందిన ఈ కార్యక్రమాన్ని క్రౌన్ లెగసీ సంస్థ ఆధ్వర్యంలో తొలిసారిగా కడప జిల్లాలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో పోటీదారులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రతిభ, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వాన్ని ప్రదర్శించారు.
నాలుగు సంవత్సరాల చిన్నారుల నుంచి వివాహిత మహిళలు, పురుషులు యువత, నలభై సంవత్సరాల వయస్సు గల ప్రతిభావంతుల వరకు మొత్తం ఎనిమిది విభాగాల్లో సుమారు 170 మంది పోటీదారులు పాల్గొన్నారు, సినీ దర్శకుడు భరత్ కార్యక్రమంలో పాల్గొని వివిధ దశల్లో జరిగిన పోటీల అనంతరం 50 మంది ఫైనలిస్టులు ఎంపిక అయ్యారు.
కడప నగరంలోని విష్ణు ప్రియ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఈ కార్యక్రమం కేవలం ఒక అందాల పోటీ మాత్రమే కాకుండా వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే మహత్తర వేదికగా నిలిచింది.. ఈకార్యక్రమంలో విజేతగా గుమ్మ శ్రీనారెడ్డి నిలిచింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




