డ్యూటీలో ఉన్న 40 మంది పోలీసులకు కరోనా…
వివిధ కంటైన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్ విధులు నిర్వహిస్తున్న 40 మంది పోలీసులు ఈ వైరస్ బారినపడ్డారు.

భారత్‌లో కోవిడ్ మహమ్మారి కోరలు చాస్తోంది. కరోనా భయానికి ప్రజలు కంటిమీద కునుకులేకుండా భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. మరోవైపు వైరస్ వ్యాప్తిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ..రాత్రింబవళ్లూ రోడ్లపై గస్తీ కాస్తున్నారు పోలీసులు. అటువంటి పోలీసులు కూడా కరోనా బారినపడుతున్నారు.వివిధ కంటైన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్ విధులు నిర్వహిస్తున్న 40 మంది పోలీసులు ఈ వైరస్ బారినపడ్డారు.
మహారాష్ట్రలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతుండటంతో కంటైన్మెంట్ జోన్ల సంఖ్య 733కు చేరింది. కాగా, రాష్ట్రంలోని మాలేగావ్‌లో వివిధ కంటైన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్ విధులు నిర్వహిస్తున్న పలువురు ఎస్ ఐలు, కానిస్టేబుళ్లు కోవిడ్ వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం వీరంతా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, రాష్ట్రంలో వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 10వేలు దాటింది. తాజాగా 583 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 10,490కి చేరింది. ఒక్క ముంబయ్‌లోనే 7061 కేసులు నమోదయ్యాయి. అంతేకాదు, మహారాష్ట్ర కరోనా మరణాల్లోనూ ముందు వరుసలో ఉంది. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 459 మంది కరోనా వైరస్ బారిన పడి మృత్యువాతపడ్డారు. శుక్రవారం ఒక్కరోజే 27మంది వైరస్ కారణంగా చనిపోయినట్లు సమాచారం.