ఏపీలో కొత్త‌గా 60 పాజిటివ్ కేసులు

ఏపీలో కొత్త‌గా 60 పాజిటివ్ కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతోంది. తాజాగా మ‌రో 60 వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు అధికారులు హెల్త్ బులిటెన్ విడుద‌ల చేశారు. కొత్త‌గా బ‌య‌ట‌ప‌డ్డ కేసుల‌తో క‌లిపి ..

Jyothi Gadda

|

May 01, 2020 | 12:59 PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతోంది. తాజాగా మ‌రో 60 వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు అధికారులు హెల్త్ బులిటెన్ విడుద‌ల చేశారు. కొత్త‌గా బ‌య‌ట‌ప‌డ్డ కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో ఇంత వ‌ర‌కు క‌రోనా కేసుల సంఖ్య 1463కు చేరింది. ముఖ్యంగా క‌ర్నూలులో క‌రోనా ఉగ్ర‌రూపం ప్ర‌ద‌ర్శింస్తోంది. ఆ జిల్లాలో క‌రోనా కేసుల సంఖ్య 400 దాటిపోయింది. గుంటూరు జిల్లాలో కోవిడ్ కేసుల 300 దాటింది. ఇక కృష్ణా జిల్లాలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 246కు చేరింది.

కాగా, తాజాగా 82 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  దీంతో కోలుకున్న వారి మొత్తం సంఖ్య 403కు చేరింది. ఇక‌ గడిచిన 24 గంటల్లో రెండు కోవిడ్‌ మరణాలు సంభవించాయని, దీంతో మొత్తం క‌రోనా మృతుల సంఖ్య‌ 33కు చేరుకున్న‌ట్లు అధికారులు వెల్లడించారు.  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 1027 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు ఆరోగ్యశాఖ చెప్పింది.

ఇక జిల్లాల వారిగా క‌రోనా కేసుల సంఖ్య ఈ విధంగా ఉంది. కర్నూలు జిల్లా – 411
గుంటూరు జిల్లా – 306
కృష్ణా జిల్లా – 246
నెల్లూరు జిల్లా -84
చిత్తూరు జిల్లా – 80
కడప జిల్లా -79
అనంతపురం జిల్లా -67
ప్రకాశం జిల్లా – 60
పశ్చిమ గోదావరి జిల్లా – 58
తూర్పుగోదావరి జిల్లా – 42
విశాఖపట్నం జిల్లా -25
శ్రీకాకుళం జిల్లా – 5
మొత్తం కేసులు -1463

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu